బిగిసే వింకా నీవు పిలిచిన రావు
(॥పల్లవి॥)
బిగిసే వింకా నీవు పిలిచిన రావు
చిగురువలెనే వుండు చేఁగ సుమ్మీ వలపు
(॥॥)
చిత్తజునియమ్ములునుఁ జెనియచూపులు లోలోఁ
బొత్తుల నున్నవి పాలువో దెన్నఁడు
హత్తినజక్కవలును నంగనచన్నులు నొళ-
జొత్తుసుమ్మీ మీఁదటెత్తు చూచుకొందుగాని
(॥॥)
తుమ్మిదలపవుఁజులు తొయ్యలినెరిఁగురులు
వుమ్మడి నున్నవి పాయ కొకటొకటి
చిమ్ములపలుకులును చిలుకలుఁ దమలోన
దొమ్మిచుట్టరిక మింకఁ దోఁచినది దెరువు
(॥॥)
చందురునివెన్నెలలు సకియలేఁతనవ్వులు
ముందువెనకలు వాసి మొద లొక్కటే
ఇందునె శ్రీవేంకటేశ ఇంత సేసి కూడితివి
పొందినసతికి నీకుఁ బొదుసుమ్మీ యెప్పుడు
(||pallavi||)
bigise viṁkā nīvu pilisina rāvu
siguruvalĕne vuṁḍu sem̐ga summī valabu
(||||)
sittajuniyammulunum̐ jĕniyasūbulu lolom̐
bŏttula nunnavi pāluvo dĕnnam̐ḍu
hattinajakkavalunu naṁganasannulu nŏḽa-
jŏttusummī mīm̐daḍĕttu sūsugŏṁdugāni
(||||)
tummidalabavum̐julu tŏyyalinĕrim̐gurulu
vummaḍi nunnavi pāya kŏgaḍŏgaḍi
simmulabalugulunu silugalum̐ damalona
dŏmmisuṭṭariga miṁkam̐ dom̐sinadi dĕruvu
(||||)
saṁdurunivĕnnĕlalu sagiyalem̐tanavvulu
muṁduvĕnagalu vāsi mŏda lŏkkaḍe
iṁdunĕ śhrīveṁkaḍeśha iṁta sesi kūḍidivi
pŏṁdinasadigi nīgum̐ bŏdusummī yĕppuḍu