Bhuvim danavaarim baasi poruguvaarim goodina

భువిఁ దనవారిఁ బాసి పొరుగువారిఁ గూడిన
Language

(॥పల్లవి॥)
భువిఁ దనవారిఁ బాసి పొరుగువారిఁ గూడిన
అవునా వొక్కటఁ బుట్టెనని ఇంతేకాక

(॥భువి॥)
రమణివిరహవేళ రాఁపుతురుము వీడి
గములై తూలాడీఁ గన్నులపొంత
కమలపుతుమ్మిదలు గండుమీలపైవ్రాల -
నమరునా వొక్కచోటివని యింతేకాక

(॥భువి॥)
చెలియచింతావేళ చిందినకన్నీటిసోన
తొలరి కుచములపైఁ దొలఁకీ నట్టె
వెలిఁ జకోరా లెనసి వెడజక్కవలవద్ద
నిలుచునా వొకజాతినేమ మింతేకాక

(॥భువి॥)
కాంత రతివేళ శ్రీవేంకటపతినెమ్మోము
దొంతియై కెమ్మోవిమీఁద దొరకె నిదె
అంత పాలచందురుఁడు అమృత మాసపడిన
యింత చెల్లునా వొక యిక్కువనికాక

(||pallavi||)
bhuvim̐ danavārim̐ bāsi pŏruguvārim̐ gūḍina
avunā vŏkkaḍam̐ buṭṭĕnani iṁtegāga

(||bhuvi||)
ramaṇivirahaveḽa rām̐pudurumu vīḍi
gamulai tūlāḍīm̐ gannulabŏṁta
kamalabudummidalu gaṁḍumīlabaivrāla -
namarunā vŏkkasoḍivani yiṁtegāga

(||bhuvi||)
sĕliyasiṁtāveḽa siṁdinagannīḍisona
tŏlari kusamulabaim̐ dŏlam̐kī naṭṭĕ
vĕlim̐ jagorā lĕnasi vĕḍajakkavalavadda
nilusunā vŏgajādinema miṁtegāga

(||bhuvi||)
kāṁta radiveḽa śhrīveṁkaḍabadinĕmmomu
dŏṁtiyai kĕmmovimīm̐da dŏragĕ nidĕ
aṁta pālasaṁdurum̐ḍu amṛta māsabaḍina
yiṁta sĕllunā vŏga yikkuvanigāga