భ్రమయకుమనరమ్మ పనిగద్దు యిఁకమీఁద
(॥పల్లవి॥)
భ్రమయకుమనరమ్మ పనిగద్దు యిఁకమీఁద
తమకించి తనవల్లఁ దప్పు వేసేవారమా
(॥భ్రమ॥)
సిగ్గుతోడ నున్నదానిఁ జేరి యలిగితినంటా
యెగ్గులెల్ల గడిఇంచే వేడ లేనివి
కగ్గి యాడో ఆఁటదాని కాతాళాలఁ బడి వచ్చి
వెగ్గళించి మా మీఁద వెళ్లించవలెనా
(॥భ్రమ॥)
మానాపతి నైనదాని మారుమాటలాడనంటా
సానఁబట్టేవు పంతాలు సారె సారె
నానఁబెట్టి తానెవ్వతోనాలిఁబడి ఇందు వచ్చి
ఆనుకొని మాగుణాలు అట్లాఁ జూచీని
(॥భ్రమ॥)
రతి నలసినదాని రాజసము చూపినట్టు
కతలెల్ల గడిఇంచి కాఁగిలించీని
యితవై శ్రీ వేంకటేశుఁ డితఁడు నన్నే కూడి
యితర సతులవలె నిటు నన్ను మెచ్చీని
(||pallavi||)
bhramayagumanaramma panigaddu yim̐kamīm̐da
tamagiṁchi tanavallam̐ dappu vesevāramā
(||bhrama||)
siggudoḍa nunnadānim̐ jeri yaligidinaṁṭā
yĕggulĕlla gaḍiiṁche veḍa lenivi
kaggi yāḍo ām̐ṭadāni kādāḽālam̐ baḍi vachchi
vĕggaḽiṁchi mā mīm̐da vĕḽliṁchavalĕnā
(||bhrama||)
mānābadi nainadāni mārumāḍalāḍanaṁṭā
sānam̐baṭṭevu paṁtālu sārĕ sārĕ
nānam̐bĕṭṭi tānĕvvadonālim̐baḍi iṁdu vachchi
ānugŏni māguṇālu aṭlām̐ jūsīni
(||bhrama||)
radi nalasinadāni rājasamu sūbinaṭṭu
kadalĕlla gaḍiiṁchi kām̐giliṁchīni
yidavai śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍu nanne kūḍi
yidara sadulavalĕ niḍu nannu mĕchchīni