భ్రమయకు చెలువుఁడ పలుమారు నీ
(॥పల్లవి॥)
భ్రమయకు చెలువుఁడ పలుమారు నీ
తమకపు పట్టపు తరుణినింతే
(॥భ్రమ॥)
నినుఁగని వొకచెలి నిలువునఁ గరఁగెనె
కనకపు బొమ్మే కాఁబోలు
అనువున నదిగాదయితే మెదలునా
మినుకన మెరచిన మెరుఁగింతే
(॥భ్రమ॥)
పొలిఁతి నీయెదుటఁ బులకించెనొరపు
గల పుష్పలతిక గాఁబోలు
తలఁచకుమటువలెఁ దగదట్లైతే
చెలఁగి పలుకునా చిలుకింతే
(॥భ్రమ॥)
పడఁతి నీయురముపై నెలకొనెనదె
కడఁగిన హరము గాఁబోలు
కడపట శ్రీవేంకటపతి గాదది
జడిసెటి నీ శ్రీసతి యింతే
(||pallavi||)
bhramayagu sĕluvum̐ḍa palumāru nī
tamagabu paṭṭabu taruṇiniṁte
(||bhrama||)
ninum̐gani vŏgasĕli niluvunam̐ garam̐gĕnĕ
kanagabu bŏmme kām̐bolu
anuvuna nadigādayide mĕdalunā
minugana mĕrasina mĕrum̐giṁte
(||bhrama||)
pŏlim̐ti nīyĕduḍam̐ bulagiṁchĕnŏrabu
gala puṣhpaladiga gām̐bolu
talam̐sagumaḍuvalĕm̐ dagadaṭlaide
sĕlam̐gi palugunā silugiṁte
(||bhrama||)
paḍam̐ti nīyuramubai nĕlagŏnĕnadĕ
kaḍam̐gina haramu gām̐bolu
kaḍabaḍa śhrīveṁkaḍabadi gādadi
jaḍisĕḍi nī śhrīsadi yiṁte