(॥పల్లవి॥)
భ్రమయక వుండేదే పరమార్థము
నెమకితే నన్నిటాను నీవే వుండుదువు
(॥భ్రమ॥)
వసుధలోఁ బురుషుల వనితల రూపులు
వెస మాయయంత్రపు వెరబొమ్మలు
ముసరి యెండొంటికి మోహించే మోహములు
అసురుసురయ్యే ఇంద్రియావేశములు
(॥భ్రమ॥)
తగిన తమలో చక్కఁదనాలు వయసులు
పగటు రక్తమాంసాల పరిపూర్ణులు
జిగి నిందుకుఁగాఁ బుట్టే చిత్తవికారములు
నిగుడుచు బయలువన్నినయట్టి వురులు
(॥భ్రమ॥)
లలి మీరి యన్యోన్యవిలాసములు భోగములు
వలవని మొయిలులేని వానజల్లు
యెలమి శ్రీవేంకటేశ యివెల్లా నీదాసులకుఁ
దెలిపి బ్రహ్మానందము తిరముగా నిత్తువు
(||pallavi||)
bhramayaga vuṁḍede paramārdhamu
nĕmagide nanniḍānu nīve vuṁḍuduvu
(||bhrama||)
vasudhalom̐ buruṣhula vanidala rūbulu
vĕsa māyayaṁtrabu vĕrabŏmmalu
musari yĕṁḍŏṁṭigi mohiṁche mohamulu
asurusurayye iṁdriyāveśhamulu
(||bhrama||)
tagina tamalo sakkam̐danālu vayasulu
pagaḍu raktamāṁsāla paribūrṇulu
jigi niṁdugum̐gām̐ buṭṭe sittavigāramulu
niguḍusu bayaluvanninayaṭṭi vurulu
(||bhrama||)
lali mīri yanyonyavilāsamulu bhogamulu
valavani mŏyiluleni vānajallu
yĕlami śhrīveṁkaḍeśha yivĕllā nīdāsulagum̐
dĕlibi brahmānaṁdamu tiramugā nittuvu