Bhoobadiseruvusemtam bomchuga radulagunu

భూపతిచెరువుచెంతఁ బొంచుక రతులకును
Language

(॥పల్లవి॥)
భూపతిచెరువుచెంతఁ బొంచుక రతులకును
యే పొద్దు సతులకును యెదురు చూచీనే

(॥భూప॥)
నవ్వులసెలవులతో నానిన చెమటలతో
పువ్వుల దండలు వేరే బుజాలతోడ
జవ్వన పాయముతోడ జారిన తురుముతోడ
యెవ్వతెనో కూడివచ్చి యీడ నున్నాఁడే

(॥భూప॥)
అరవిరి బాగులతో నాయముల కరఁగులతో
గరిమల నెమ్మొగము కళలతోడ
సురత వాసనలతో చొక్కపు సింగారాలతో
పురిగొన్న వేడుకతో భోగించీనే

(॥భూప॥)
పుక్కిటి విడేలతోడ పులక జొంపాలతోడ
పిక్కటిలఁ దేనెలూరే పెదవితోడ
యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
వెక్కసపుఁ దమకాన వినోదించీనే

(||pallavi||)
bhūbadisĕruvusĕṁtam̐ bŏṁchuga radulagunu
ye pŏddu sadulagunu yĕduru sūsīne

(||bhūba||)
navvulasĕlavulado nānina sĕmaḍalado
puvvula daṁḍalu vere bujāladoḍa
javvana pāyamudoḍa jārina turumudoḍa
yĕvvadĕno kūḍivachchi yīḍa nunnām̐ḍe

(||bhūba||)
araviri bāgulado nāyamula karam̐gulado
garimala nĕmmŏgamu kaḽaladoḍa
surada vāsanalado sŏkkabu siṁgārālado
purigŏnna veḍugado bhogiṁchīne

(||bhūba||)
pukkiḍi viḍeladoḍa pulaga jŏṁpāladoḍa
pikkaḍilam̐ denĕlūre pĕdavidoḍa
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
vĕkkasabum̐ damagāna vinodiṁchīne