భోగించవయ్యా మంచిభోగములెల్ల
(॥పల్లవి॥)
భోగించవయ్యా మంచిభోగములెల్ల
తీగెసాగిన మోహమే దిష్టసంపదాయను
(॥భోగిం॥)
పలుకుఁదేనెలు నీపైఁ బలుమారుఁ జిందఁగాను
కలిమిఁ బన్నీటిజలకములాయను
కలికి నవ్వులు నట్టె కలయఁగఁ జల్లఁగాను
అలరి కప్పురకాపునైమించెను
(॥భోగిం॥)
జిగి సింగారరసము చేరి నీపై నొలుకఁగా
పొగరుమించులతట్టుపుణుఁగాయను
మగువకాంతులు నిన్ను మచ్చికతో నొరయఁగా
సొగసుగాఁ జాతుకొన్న సొమ్ములాయను
(॥భోగిం॥)
అలమేల్మంగ నీవురమందు నెలవుకొనఁగా
బలిమి నన్నిటా నీభాగ్యమాయను
యెలమి శ్రీవేంకటేశ యీకె నినుఁ గూడఁగాను
కలకాలమును నిట్టె కాణాచాయను
(||pallavi||)
bhogiṁchavayyā maṁchibhogamulĕlla
tīgĕsāgina mohame diṣhṭasaṁpadāyanu
(||bhogiṁ||)
palugum̐denĕlu nībaim̐ balumārum̐ jiṁdam̐gānu
kalimim̐ bannīḍijalagamulāyanu
kaligi navvulu naṭṭĕ kalayam̐gam̐ jallam̐gānu
alari kappuragābunaimiṁchĕnu
(||bhogiṁ||)
jigi siṁgārarasamu seri nībai nŏlugam̐gā
pŏgarumiṁchuladaṭṭubuṇum̐gāyanu
maguvagāṁtulu ninnu machchigado nŏrayam̐gā
sŏgasugām̐ jādugŏnna sŏmmulāyanu
(||bhogiṁ||)
alamelmaṁga nīvuramaṁdu nĕlavugŏnam̐gā
balimi nanniḍā nībhāgyamāyanu
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ ninum̐ gūḍam̐gānu
kalagālamunu niṭṭĕ kāṇāsāyanu