భోగించఁ బుట్టిన సొమ్ము పొంచి పరాన కేలోపు
(॥పల్లవి॥)
భోగించఁ బుట్టిన సొమ్ము పొంచి పరాన కేలోపు
శ్రీగురుఁడ నీవే దయసేతువు గాని
(॥భోగిం॥)
యీరెండుచేతులే యిన్ని పాపాలకు నోపు
వూరకే పుణ్యము సేయనోపవు గాని
మారుకొ నీరెండుగాళ్లే మాపుదాఁకాఁ జుట్టనోపు
యేరీతి దేవ నీగుడి కేఁగ నలసుఁ గాని
(॥భోగిం॥)
కన్ను లివి రెండే మిన్నుగలంతాఁ జూడనోపు
ఉన్నతి నాసాగ్రదృష్టి కోపవు గాని
అన్నిటా రెండుపెదవు లధరామృతాన కోపు
సన్నల మోక్షముత్రోవ జపించవు గాని
(॥భోగిం॥)
యీవీనులు రెండే విశ్వమంతా నాలించనోపు
వోవల శాస్త్రాలకైతే నోపవు గాని
శ్రీవేంకటేశ నీవే చిత్తాన జ్ఞానమిచ్చితే
భావించి జీవుఁడిన్నిటా బ్రదుకనోపుఁ గాని
(||pallavi||)
bhogiṁcham̐ buṭṭina sŏmmu pŏṁchi parāna kelobu
śhrīgurum̐ḍa nīve dayaseduvu gāni
(||bhogiṁ||)
yīrĕṁḍusedule yinni pābālagu nobu
vūrage puṇyamu seyanobavu gāni
mārugŏ nīrĕṁḍugāḽle mābudām̐kām̐ juṭṭanobu
yerīdi deva nīguḍi kem̐ga nalasum̐ gāni
(||bhogiṁ||)
kannu livi rĕṁḍe minnugalaṁtām̐ jūḍanobu
unnadi nāsāgradṛṣhṭi kobavu gāni
anniḍā rĕṁḍubĕdavu ladharāmṛtāna kobu
sannala mokṣhamutrova jabiṁchavu gāni
(||bhogiṁ||)
yīvīnulu rĕṁḍe viśhvamaṁtā nāliṁchanobu
vovala śhāstrālagaide nobavu gāni
śhrīveṁkaḍeśha nīve sittāna jñānamichchide
bhāviṁchi jīvum̐ḍinniḍā braduganobum̐ gāni