Bhogasahaayule porugellaa

భోగసహాయులె పొరుగెల్లా
Language

(॥పల్లవి॥)
భోగసహాయులె పొరుగెల్లా
ఆగమవిదు(ధు)లును ననంతములు

(॥భోగ॥)
కులమునఁ జుట్టాలు కోటాఁనగోట్లు
కలిమిలేమి కొక్కఁడనే గుఱి
పలులంపటముల ప్రజలే యిందరు
నిలిచిన చోటికి నే నొక్కఁడనే

(॥భోగ॥)
చెట్టడిచిన నిదె చేటఁడు పండ్లు
గుట్టు దెలుసుకొన గురి నేను
వొట్టుక సంసార మూరల్లా నిదె
పుట్టినప్పటికి భువి నొక్కఁడనే

(॥భోగ॥)
చనవుమనవులకు జగమెల్లా నిదె
కొనకు మొదలికిని గురి నేను
యెనయుచు శ్రీవేంకటేశుఁ డేలెఁ గన
నినుపుగమికాఁడ నే నొక్కఁడనే

(||pallavi||)
bhogasahāyulĕ pŏrugĕllā
āgamavidu(dhu)lunu nanaṁtamulu

(||bhoga||)
kulamunam̐ juṭṭālu koḍām̐nagoṭlu
kalimilemi kŏkkam̐ḍane guṟi
palulaṁpaḍamula prajale yiṁdaru
nilisina soḍigi ne nŏkkam̐ḍane

(||bhoga||)
sĕṭṭaḍisina nidĕ seḍam̐ḍu paṁḍlu
guṭṭu dĕlusugŏna guri nenu
vŏṭṭuga saṁsāra mūrallā nidĕ
puṭṭinappaḍigi bhuvi nŏkkam̐ḍane

(||bhoga||)
sanavumanavulagu jagamĕllā nidĕ
kŏnagu mŏdaligini guri nenu
yĕnayusu śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ gana
ninubugamigām̐ḍa ne nŏkkam̐ḍane