Bhayamellaam baase yimkam baniledu

భయమెల్లాఁ బాసె యిఁకఁ బనిలేదు
Language

(॥పల్లవి॥)
భయమెల్లాఁ బాసె యిఁకఁ బనిలేదు
జయమై నీకాతఁడు సమ్మతించుండఁగను

(॥॥)
ననుపై నీవతనితో నవ్వు నవ్వవలదా
చనవు నీకిచ్చినది చాలాఁ గద్దు
గునిసి నీవప్పటిని కొసరఁగ వలదా
పెనఁగి నీకాతఁడు ప్రియము చెప్పఁగను

(॥॥)
బెట్టుగా నీవతనితో బిగియఁగవలదా
పట్టిపట్టి నిన్నిట్లాఁ బాలార్చఁగను
చుట్టిమవై కమ్మటిని సూడువట్ట వలదా
ఱట్టుగా నీకాతఁడు గుట్టు సేయఁగాను

(॥॥)
చలపట్టి నీవాతని సాధించ వలదా
యెలమిఁదప్పని బాసలియ్యఁగాను
అలరి శ్రీవేంకటేశుఁడతఁడే నిన్నిదె కూడె
యిల నిన్నురముమీఁద నెక్కించుకుండఁగాను

(||pallavi||)
bhayamĕllām̐ bāsĕ yim̐kam̐ baniledu
jayamai nīgādam̐ḍu sammadiṁchuṁḍam̐ganu

(||||)
nanubai nīvadanido navvu navvavaladā
sanavu nīgichchinadi sālām̐ gaddu
gunisi nīvappaḍini kŏsaram̐ga valadā
pĕnam̐gi nīgādam̐ḍu priyamu sĕppam̐ganu

(||||)
bĕṭṭugā nīvadanido bigiyam̐gavaladā
paṭṭibaṭṭi ninniṭlām̐ bālārsam̐ganu
suṭṭimavai kammaḍini sūḍuvaṭṭa valadā
ṟaṭṭugā nīgādam̐ḍu guṭṭu seyam̐gānu

(||||)
salabaṭṭi nīvādani sādhiṁcha valadā
yĕlamim̐dappani bāsaliyyam̐gānu
alari śhrīveṁkaḍeśhum̐ḍadam̐ḍe ninnidĕ kūḍĕ
yila ninnuramumīm̐da nĕkkiṁchuguṁḍam̐gānu