(॥పల్లవి॥)
భళి భళి మాకిది పరిణాము
పెలుచగు వలపులు పెరిగీఁ గా
(॥భళి॥)
ఆకెకు నీకును నంగన వొక్కతె
సాకిరి గలిగెఁగా సంగడిని
చెకొని మీకును సెలువుల నవ్వుచు
సైకపుసరసము జరగీఁగా
(॥భళి॥)
మదనరహస్యపుమర్మము చిలుకలు
అదనుగ నేర్చెఁగా అన్నియును
కదిసినసిగ్గులు గరఁగుచు మీలోఁ
నుదుటుసంతసము లొనరీఁగా
(॥భళి॥)
శ్రీవేంకటేశ్వర చెలి నీ కూటమి
భావపుకళలై పయికొనెఁగా
యీవల నీవే యిటు ననుఁ గూడితి
కైవశము నాకుఁ గలిగీఁగా
(||pallavi||)
bhaḽi bhaḽi māgidi pariṇāmu
pĕlusagu valabulu pĕrigīm̐ gā
(||bhaḽi||)
āgĕgu nīgunu naṁgana vŏkkadĕ
sāgiri galigĕm̐gā saṁgaḍini
sĕgŏni mīgunu sĕluvula navvusu
saigabusarasamu jaragīm̐gā
(||bhaḽi||)
madanarahasyabumarmamu silugalu
adanuga nersĕm̐gā anniyunu
kadisinasiggulu garam̐gusu mīlom̐
nuduḍusaṁtasamu lŏnarīm̐gā
(||bhaḽi||)
śhrīveṁkaḍeśhvara sĕli nī kūḍami
bhāvabugaḽalai payigŏnĕm̐gā
yīvala nīve yiḍu nanum̐ gūḍidi
kaivaśhamu nāgum̐ galigīm̐gā