Bhaktavatsalumdavugaa bhaavimcha nee kidi dagu

భక్తవత్సలుఁడవుగా భావించ నీ కిది దగు
Language

(॥పల్లవి॥)
భక్తవత్సలుఁడవుగా భావించ నీ కిది దగు
శక్తి నీకెంతైనాఁ గద్దు సర్వేశ్వరా

(॥భక్త॥)
నా వాఁడవే యని వుందు నని నీ వెవ్వరికైనా
ఆవల నందరివాఁడవై వుండుదువు
భావించనిందుకొరకా బహురూపుఁడ వైతివి
వేవేలు శిరసులతో విశ్వమూరితీ

(॥భక్త॥)
నీ పేరు నా నాలికెపై నెలకొనె యీ రీతినే
దాపై యందరినోళ్ల దగి లున్నవి
యేపునఁ బెక్కు నామము లిందుకా పెట్టుకొంటివి
వోపి నానాశబ్ధములతో నుర్వీదరా

(॥భక్త॥)
యేలికెపు నాకని యెంచుకొందు నేపొద్దు
యీలీల నందరికీ నేలిక నట
తాలిచితి వనంతావతారాలు నీ వీ పనికా
వేళతో నానాగతి శ్రీవేంకటేశ్వరా

(||pallavi||)
bhaktavatsalum̐ḍavugā bhāviṁcha nī kidi dagu
śhakti nīgĕṁtainām̐ gaddu sarveśhvarā

(||bhakta||)
nā vām̐ḍave yani vuṁdu nani nī vĕvvarigainā
āvala naṁdarivām̐ḍavai vuṁḍuduvu
bhāviṁchaniṁdugŏragā bahurūbum̐ḍa vaidivi
vevelu śhirasulado viśhvamūridī

(||bhakta||)
nī peru nā nāligĕbai nĕlagŏnĕ yī rīdine
dābai yaṁdarinoḽla dagi lunnavi
yebunam̐ bĕkku nāmamu liṁdugā pĕṭṭugŏṁṭivi
vobi nānāśhabdhamulado nurvīdarā

(||bhakta||)
yeligĕbu nāgani yĕṁchugŏṁdu nebŏddu
yīlīla naṁdarigī neliga naḍa
tālisidi vanaṁtāvadārālu nī vī panigā
veḽado nānāgadi śhrīveṁkaḍeśhvarā