Bhaavimpa nee vokkamdave bahuroobaala numduduvu

భావింప నీ వొక్కఁడవే బహురూపాల నుండుదువు
Language

(॥పల్లవి॥)
భావింప నీ వొక్కఁడవే బహురూపాల నుండుదువు
దేవదేవ నీ మహిమ దెలియఁగ వశమా

(॥భావింప॥)
నిన్నుఁ దలఁచేవారిలో నిజరూపుతో నుండుదువు
అన్ని జంతువులలోన నంతరాత్మవై వుండుదువు
పన్ని పంచభూతములలోపల నాధారమై వుండుదువు
వున్న మూఢులలో మాయ నొనగూడి వుండుదువు

(॥భావింప॥)
సరుస తరువులలో చైతన్యమవై వుండుదువు
గరిమె రాక్షసులలోన కానరాక వుండుదువు
సురలందు యీశ్వరసూచనతో నుండుదువు
అరయ ముక్తులలోన ఆనందమవై వుండుదువు

(॥భావింప॥)
జగము లన్నిటిలోన సాక్షివై వుండుదువు
తగిలి వేదములలోన అర్ధమై వుండుదు
జిగి మించ సర్వదాను శ్రీవేంకటగిరి నుండుదు
సగుణమై దాసులకు సాకారమవై వుండుదువు

(||pallavi||)
bhāviṁpa nī vŏkkam̐ḍave bahurūbāla nuṁḍuduvu
devadeva nī mahima dĕliyam̐ga vaśhamā

(||bhāviṁpa||)
ninnum̐ dalam̐sevārilo nijarūbudo nuṁḍuduvu
anni jaṁtuvulalona naṁtarātmavai vuṁḍuduvu
panni paṁchabhūdamulalobala nādhāramai vuṁḍuduvu
vunna mūḍhulalo māya nŏnagūḍi vuṁḍuduvu

(||bhāviṁpa||)
sarusa taruvulalo saidanyamavai vuṁḍuduvu
garimĕ rākṣhasulalona kānarāga vuṁḍuduvu
suralaṁdu yīśhvarasūsanado nuṁḍuduvu
araya muktulalona ānaṁdamavai vuṁḍuduvu

(||bhāviṁpa||)
jagamu lanniḍilona sākṣhivai vuṁḍuduvu
tagili vedamulalona ardhamai vuṁḍudu
jigi miṁcha sarvadānu śhrīveṁkaḍagiri nuṁḍudu
saguṇamai dāsulagu sāgāramavai vuṁḍuduvu