Bhaavimchugo ramanumda pasaarimchidi mide

భావించుకో రమణుఁడ పచారించితి మిదె
Language

(॥పల్లవి॥)
భావించుకో రమణుఁడ పచారించితి మిదె
నీ విచ్చిన సలిగె నేరుచుకొన్నారము

(॥భావిం॥)
కన్నుల జంకింతుము కాఁకలు చల్లుదుము
ఇన్నియు నీపై మోహమే యీసుగాదు
కన్నెలము నేమట కాంతుఁడవు నీవట
నిన్ను మీరే పను లేవి నీదయ గోరుదుము

(॥భావిం॥)
అట్టె వెంగే లాడుదుము ఆయము లంటింతుము
గుట్టున నీతో పొందుకే కోపము గాదు
పట్టు మాకు నీవే యట బలిమి నీచేతిదట
నెట్టన నీ కెదురేది నేనెంత వారము

(॥భావిం॥)
రతులఁ బెనఁగుదుము రాజసము చూపుదుము
ఇతవు నీకుఁ జేసేదే యెరవు గాదు
గతి మాకు నీవే శ్రీ వేంకటేశుఁడ కూడితివి
మతకాలు నీ మీఁదనా మచ్చికైనవారము

(||pallavi||)
bhāviṁchugo ramaṇum̐ḍa pasāriṁchidi midĕ
nī vichchina saligĕ nerusugŏnnāramu

(||bhāviṁ||)
kannula jaṁkiṁtumu kām̐kalu salludumu
inniyu nībai mohame yīsugādu
kannĕlamu nemaḍa kāṁtum̐ḍavu nīvaḍa
ninnu mīre panu levi nīdaya gorudumu

(||bhāviṁ||)
aṭṭĕ vĕṁge lāḍudumu āyamu laṁṭiṁtumu
guṭṭuna nīdo pŏṁduge kobamu gādu
paṭṭu māgu nīve yaḍa balimi nīsedidaḍa
nĕṭṭana nī kĕduredi nenĕṁta vāramu

(||bhāviṁ||)
radulam̐ bĕnam̐gudumu rājasamu sūbudumu
idavu nīgum̐ jesede yĕravu gādu
gadi māgu nīve śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidivi
madagālu nī mīm̐danā machchigainavāramu