భావించ రహస్యమైన పనులు లేవా బూమిలో
(॥పల్లవి॥)
భావించ రహస్యమైన పనులు లేవా బూమిలో
యీవేళ నాతని కోర్కి యీడేర్చఁగదవే
(॥భావిం॥)
చివ్వున నాతఁడు నిన్నుఁ జెయివట్టి తీసితెను
రవ్వగానేల చెప్పేవే రమణులతో
నివ్వటిల్ల నేకతాన నిన్నుఁగోర నూఁదితేను
వువ్విళ్లూరఁ జూపుదురా వూరివారి కల్లాను
(॥భావిం॥)
తమకింటి నీకతఁడు తమ్ములము వెట్టితేను
తిమురుచుఁ గోపింతురా దేవుళ్లవొద్ద
అమర నీరతి కాతఁడాసపడి నవ్వితేను
సముకపువారినల్లా సాకిరి వెట్టుదురా
(॥భావిం॥)
మొగి శ్రీ వేంకటేశుఁడు ముంచి నిన్నుఁ గూడితేను
తగవు లడుగుదురా దండవారిని
మగటిమి నలమేలుమంగవిభుఁ డీతఁడు
అగడు సేయవచ్చునా అప్పటి నాతోను
(||pallavi||)
bhāviṁcha rahasyamaina panulu levā būmilo
yīveḽa nādani korgi yīḍersam̐gadave
(||bhāviṁ||)
sivvuna nādam̐ḍu ninnum̐ jĕyivaṭṭi tīsidĕnu
ravvagānela sĕppeve ramaṇulado
nivvaḍilla negadāna ninnum̐gora nūm̐didenu
vuvviḽlūram̐ jūbudurā vūrivāri kallānu
(||bhāviṁ||)
tamagiṁṭi nīgadam̐ḍu tammulamu vĕṭṭidenu
timurusum̐ gobiṁturā devuḽlavŏdda
amara nīradi kādam̐ḍāsabaḍi navvidenu
samugabuvārinallā sāgiri vĕṭṭudurā
(||bhāviṁ||)
mŏgi śhrī veṁkaḍeśhum̐ḍu muṁchi ninnum̐ gūḍidenu
tagavu laḍugudurā daṁḍavārini
magaḍimi nalamelumaṁgavibhum̐ ḍīdam̐ḍu
agaḍu seyavachchunā appaḍi nādonu