Bhaavameramganivaaru pachchemduru gaani goru

భావమెరఁగనివారు పచ్చెందురు గాని గోరు
Language

(॥పల్లవి॥)
భావమెరఁగనివారు పచ్చెందురు గాని గోరు
తావులెరిఁగితే సురతపుసొమ్ము గోరు

(॥భావ॥)
అలిగినవేళలనంటకుండాఁ జిమ్ము గోరు
వలపు నిలుపరాక వడిఁజాఁచేదొక గోరు
చలపట్టి వేరొకతె జగడము దీసే గోరు
బలిమి పంతానకుపచరించేది గోరు

(॥భావ॥)
శిరసువంపులలోని సిగ్గులు వాపేది గోరు
సరిఁ బరవశములెచ్చరించు గోరు
వొరసితే గురిసేను నుబ్బుఁగవణపు గోరు
సరసమాడేవేళ చవిరేఁచు గోరు

(॥భావ॥)
సమ్మతించకుంటేఁ దాఁకి జంటకు లోఁజేసు గోరు
పమ్మి మనసుకుఁ జలివాపు గోరు
దిమ్ముల వయోమదము తెలియని సాక్షి గోరు
కొమ్మ శ్రీ వేంకటేశుతోఁ గూడే యిక్కువ గోరు

(||pallavi||)
bhāvamĕram̐ganivāru pachchĕṁduru gāni goru
tāvulĕrim̐gide suradabusŏmmu goru

(||bhāva||)
aliginaveḽalanaṁṭaguṁḍām̐ jimmu goru
valabu nilubarāga vaḍim̐jām̐sedŏga goru
salabaṭṭi verŏgadĕ jagaḍamu dīse goru
balimi paṁtānagubasariṁchedi goru

(||bhāva||)
śhirasuvaṁpulaloni siggulu vābedi goru
sarim̐ baravaśhamulĕchchariṁchu goru
vŏraside gurisenu nubbum̐gavaṇabu goru
sarasamāḍeveḽa savirem̐su goru

(||bhāva||)
sammadiṁchaguṁṭem̐ dām̐ki jaṁṭagu lom̐jesu goru
pammi manasugum̐ jalivābu goru
dimmula vayomadamu tĕliyani sākṣhi goru
kŏmma śhrī veṁkaḍeśhudom̐ gūḍe yikkuva goru