Bhaava meṟimgina nallaballi sennumdaa

భావ మెఱిఁగిన నల్లబల్లి చెన్నుఁడా
Language

(॥పల్లవి॥)
భావ మెఱిఁగిన నల్లబల్లి చెన్నుఁడా
నావద్దనే వుండుమీ నల్లఁబల్లి చెన్నుఁడా

(॥॥)
వేసరక నీవు నాతో వేమారుఁ జేసినట్టి
బాసలు నమ్మితి నల్లఁబల్లి చెన్నుఁడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను
నా సూటికే మన్నించు నల్లఁబల్లి చెన్నుఁడా

(॥॥)
క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి
బయలీఁదించకు నల్లఁబల్లి చెన్నుఁడా
ప్రియములు రెట్టింపఁ బెనఁగితి నిందాఁకా
నయములు చూపుమీ నల్లఁబల్లి చెన్నుఁడా

(॥॥)
యెనిసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని
పనుపడె రతి నల్లఁబల్లి చెన్నుఁడా
ఘనశ్రీవేంకటాదిపై కందువ నేలుకొంటివి
నను నిందరిలోపల నల్లఁబల్లి చెన్నుఁడా

(||pallavi||)
bhāva mĕṟim̐gina nallaballi sĕnnum̐ḍā
nāvaddane vuṁḍumī nallam̐balli sĕnnum̐ḍā

(||||)
vesaraga nīvu nādo vemārum̐ jesinaṭṭi
bāsalu nammidi nallam̐balli sĕnnum̐ḍā
vāsigi vannĕgu nīgu valasi sŏkkidi nenu
nā sūḍige manniṁchu nallam̐balli sĕnnum̐ḍā

(||||)
kriya gūḍa nenu nī keluvaṭṭi pĕṁḍlāḍidi
bayalīm̐diṁchagu nallam̐balli sĕnnum̐ḍā
priyamulu rĕṭṭiṁpam̐ bĕnam̐gidi niṁdām̐kā
nayamulu sūbumī nallam̐balli sĕnnum̐ḍā

(||||)
yĕnisidi viḍu nannu niyyagolu sesugŏni
panubaḍĕ radi nallam̐balli sĕnnum̐ḍā
ghanaśhrīveṁkaḍādibai kaṁduva nelugŏṁṭivi
nanu niṁdarilobala nallam̐balli sĕnnum̐ḍā