భామలు చూడరే తిరుపతి గోవిందుఁడు వాఁడే
(॥పల్లవి॥)
భామలు చూడరే తిరుపతి గోవిందుఁడు వాఁడే
ప్రేమతోఁ జన్నులఁ బాలు పిండీ నవ్వులకు
(॥భామ॥)
అట్టులెల్లాఁ దిని తిని అదివో యెవ్వరివాఁడే
వుట్టులపైఁ బిల్లఁగోవు లూదుచున్నాఁడు
పట్టపగలే కొందరు పడుచులఁ గూడుకొని
అట్టుగపైఁ బిల్లగొ ట్లాడుచున్నాఁడు
(॥భామ॥)
కతలుగా పన్నారుకాఁగులలో బియ్యాలు
సతులపై సేసలు చల్లీ వాఁడే
తతి వారింటివెన్నే తాఁదిని యిల్లాండ్లనోళ
చతురత బువ్వమంటాఁ జమరీ వాఁడే
(॥భామ॥)
గక్కన నావుఁ బిదికేకాంతమెడ నెక్కుకొని
యెక్కిరింత ఆటలాడీ వాఁడే
అక్కజపు శ్రీవేంకటాద్రిమీఁద నిలుచుండి
చక్కఁగా వినోదాలు సలిపీ వాఁడే
(||pallavi||)
bhāmalu sūḍare tirubadi goviṁdum̐ḍu vām̐ḍe
premadom̐ jannulam̐ bālu piṁḍī navvulagu
(||bhāma||)
aṭṭulĕllām̐ dini tini adivo yĕvvarivām̐ḍe
vuṭṭulabaim̐ billam̐govu lūdusunnām̐ḍu
paṭṭabagale kŏṁdaru paḍusulam̐ gūḍugŏni
aṭṭugabaim̐ billagŏ ṭlāḍusunnām̐ḍu
(||bhāma||)
kadalugā pannārugām̐gulalo biyyālu
sadulabai sesalu sallī vām̐ḍe
tadi vāriṁṭivĕnne tām̐dini yillāṁḍlanoḽa
sadurada buvvamaṁṭām̐ jamarī vām̐ḍe
(||bhāma||)
gakkana nāvum̐ bidigegāṁtamĕḍa nĕkkugŏni
yĕkkiriṁta āḍalāḍī vām̐ḍe
akkajabu śhrīveṁkaḍādrimīm̐da nilusuṁḍi
sakkam̐gā vinodālu salibī vām̐ḍe