Bhaamaladom boramgaanu phalamemi neegu vachche

భామలతోఁ బోరఁగాను ఫలమేమి నీకు వచ్చె
Language

(॥పల్లవి॥)
భామలతోఁ బోరఁగాను ఫలమేమి నీకు వచ్చె
యేమిటికిఁ గాతరించే వింతలోనే నీవు

(॥భామ॥)
సిగ్గులే మూలధనము చెలులకెల్లా నీవు
బగ్గననేల పట్టేవు పయ్యదకొంగు
నిగ్గులమోనములే నిఁడురాజ్యపదవులు
అగ్గలమై యాల మాటలాడిచేవు నీవు

(॥భామ॥)
పంతమే పెట్టనికోట పడఁతుల కెల్లాను
వంతుకునేల తీసేవు వారియిండ్లకు
చెంతల గుట్టునవ్వులే సేయనిసింగారాలు
చెంతనుండి యేల గరిసించేవు నీవు

(॥భామ॥)
చలమే ముందరిపౌఁజు సతులకునెల్లాను
చెలఁగి యేల ప్రియముచెప్పేవు నీవు
బలిమి శ్రీవేంకటేశ బాసయిచ్చి కూడితివి
పెలుచుఁగుచములేల పిసికేవు నీవు

(||pallavi||)
bhāmaladom̐ boram̐gānu phalamemi nīgu vachchĕ
yemiḍigim̐ gādariṁche viṁtalone nīvu

(||bhāma||)
siggule mūladhanamu sĕlulagĕllā nīvu
baggananela paṭṭevu payyadagŏṁgu
niggulamonamule nim̐ḍurājyabadavulu
aggalamai yāla māḍalāḍisevu nīvu

(||bhāma||)
paṁtame pĕṭṭanigoḍa paḍam̐tula kĕllānu
vaṁtugunela tīsevu vāriyiṁḍlagu
sĕṁtala guṭṭunavvule seyanisiṁgārālu
sĕṁtanuṁḍi yela garisiṁchevu nīvu

(||bhāma||)
salame muṁdaribaum̐ju sadulagunĕllānu
sĕlam̐gi yela priyamusĕppevu nīvu
balimi śhrīveṁkaḍeśha bāsayichchi kūḍidivi
pĕlusum̐gusamulela pisigevu nīvu