భామల చయ్యాటాలు నీభాగ్య మాయను
(॥పల్లవి॥)
భామల చయ్యాటాలు నీభాగ్య మాయను
యేమరక నీ మేలొక టినుమడి సేసెను
(॥॥)
ఇద్దరుసవతులును యెదిరించి పెనఁగఁగా
వద్దని నడుము చొచ్చి వారించితివి
కొద్దితో నాలుగుచనుగుబ్బలు నీమేనను
చద్దికి వేఁడికి నొత్తి సమరతి సేసెను
(॥॥)
చెలు లొకరొకరిపై చేతులు చాఁచుకోఁగా
తొలఁగకడ్డమై మాన్ప దొరకొంటివి
కెలఁకుల నెదురుగాఁగిళ్లు నీ మెడఁ దగిలి
వెలలేనివలపులు వేడుకలు సేసెను
(॥॥)
కన్నుల నీకె నాకె కడుజంకించి చూడఁగా
కన్నెలకు గురై నిల్చి కలసితివి
నన్నేలి శ్రీ వేంకటేశ నడుచు నీ వుండఁగాను
అన్నిటాఁ గల్వలై నిన్ను నవే పూజసేసెను
(||pallavi||)
bhāmala sayyāḍālu nībhāgya māyanu
yemaraga nī melŏga ṭinumaḍi sesĕnu
(||||)
iddarusavadulunu yĕdiriṁchi pĕnam̐gam̐gā
vaddani naḍumu sŏchchi vāriṁchidivi
kŏddido nālugusanugubbalu nīmenanu
saddigi vem̐ḍigi nŏtti samaradi sesĕnu
(||||)
sĕlu lŏgarŏgaribai sedulu sām̐sugom̐gā
tŏlam̐gagaḍḍamai mānpa dŏragŏṁṭivi
kĕlam̐kula nĕdurugām̐giḽlu nī mĕḍam̐ dagili
vĕlalenivalabulu veḍugalu sesĕnu
(||||)
kannula nīgĕ nāgĕ kaḍujaṁkiṁchi sūḍam̐gā
kannĕlagu gurai nilsi kalasidivi
nanneli śhrī veṁkaḍeśha naḍusu nī vuṁḍam̐gānu
anniḍām̐ galvalai ninnu nave pūjasesĕnu