బేరి జోకొట్టుచు మాతోఁ బెనఁగే వప్పటి నీవు
(॥పల్లవి॥)
బేరి జోకొట్టుచు మాతోఁ బెనఁగే వప్పటి నీవు
నేరిచినంతా మాతో నేరుపుదువు గాక
(॥బేరి॥)
అట్టే నీ వేమి సేసినా నడ్డమాడేనా నీకు
వట్టి యాసలు వెట్టుకో వద్దంటిఁ గాక
మట్టు మీరిన దొరవు మాకేల యింత వెఱవ
పట్టిన చలముతోనే బతుకుదువు గాకా
(॥బేరి॥)
తెలిపి నీగుణములు తిద్ద వచ్చేమా నేము
వలపు మాతోఁ జెప్ప వద్దంటిఁ గాక
పెలుచు మగవాఁడవు పిలువ మమ్మిఁక నేల
తిలకించి నీ యిచ్చఁదిరుగుదువు గాకా
(॥బేరి॥)
కొంకక నాతో నవ్వఁగాఁ గోపగించితినా నేను
వంక లొత్తి మాటలాడ వద్దంటిఁ గాక
అంకెల శ్రీవేంకటేశ అట్టె ననుఁ గూడితివి
మంకు దీరె నిట్లానే మన్నింతువు గాకా
(||pallavi||)
beri jogŏṭṭusu mādom̐ bĕnam̐ge vappaḍi nīvu
nerisinaṁtā mādo nerubuduvu gāga
(||beri||)
aṭṭe nī vemi sesinā naḍḍamāḍenā nīgu
vaṭṭi yāsalu vĕṭṭugo vaddaṁṭim̐ gāga
maṭṭu mīrina dŏravu māgela yiṁta vĕṟava
paṭṭina salamudone baduguduvu gāgā
(||beri||)
tĕlibi nīguṇamulu tidda vachchemā nemu
valabu mādom̐ jĕppa vaddaṁṭim̐ gāga
pĕlusu magavām̐ḍavu piluva mammim̐ka nela
tilagiṁchi nī yichcham̐diruguduvu gāgā
(||beri||)
kŏṁkaga nādo navvam̐gām̐ gobagiṁchidinā nenu
vaṁka lŏtti māḍalāḍa vaddaṁṭim̐ gāga
aṁkĕla śhrīveṁkaḍeśha aṭṭĕ nanum̐ gūḍidivi
maṁku dīrĕ niṭlāne manniṁtuvu gāgā