(॥పల్లవి॥)
బయ లీఁదించకురే పలుమరు యీ
ప్రియుని పేర నిందరినిఁ బిలిచీఁ జెలియా
(॥బయ॥)
తడవి తవ్వకురే తమకపుఁజెలమ
వుడుకుచు నువ్విళ్లూరీని
పుడికి పెంచకురే పులకల నారూ
వొడలి బడలికల నొరగీఁ జెలియా
(॥బయ॥)
దరికొలుపకురే తలపోఁతదాలి
కరసాన కాఁకలఁ గనలీని
పురికొలుపకురే పుక్కిటి వూరుపూలూ
శిరసు నొప్పుల చేతఁ జిమిడీఁ జెలియా
(॥బయ॥)
మంతన మాడకురే మతిలోని యలపులు
వంతలనే వదనము వంచీని
చెంతల విసరరె శ్రీ వేంకటపతి
సంతపు లేఁజెమటల జడిసీఁ జెలియా
(||pallavi||)
baya līm̐diṁchagure palumaru yī
priyuni pera niṁdarinim̐ bilisīm̐ jĕliyā
(||baya||)
taḍavi tavvagure tamagabum̐jĕlama
vuḍugusu nuvviḽlūrīni
puḍigi pĕṁchagure pulagala nārū
vŏḍali baḍaligala nŏragīm̐ jĕliyā
(||baya||)
darigŏlubagure talabom̐tadāli
karasāna kām̐kalam̐ ganalīni
purigŏlubagure pukkiḍi vūrubūlū
śhirasu nŏppula sedam̐ jimiḍīm̐ jĕliyā
(||baya||)
maṁtana māḍagure madiloni yalabulu
vaṁtalane vadanamu vaṁchīni
sĕṁtala visararĕ śhrī veṁkaḍabadi
saṁtabu lem̐jĕmaḍala jaḍisīm̐ jĕliyā