బత్తిసేయఁగా నీవు పరాకు సేయఁగరాదు
(॥పల్లవి॥)
బత్తిసేయఁగా నీవు పరాకు సేయఁగరాదు
వుత్తలపు వలపు నోలలాడవయ్యా
(॥బత్తి॥)
మనసు గరఁగి నీతో మాఁటలడీ జవరాలు
వినవయ్యా నీవు గడువేడుకతోను
వొనర నప్పటనుండి వొద్దనే కాచుకున్నది
చెనకి సరసమాడి సేవగొనవయ్యా
(॥బత్తి॥)
చలిమి బలిమితోడ సన్నలెల్లాఁ జేసీని
తెలుసుకోవయా నీవు తేఁకవతోను
కొలువులుసేసి నిన్నుఁ గూరిములు గొసరీని
పిలిచి లాలనతోడఁ బ్రియమందవయ్యా
(॥బత్తి॥)
మిక్కిలి కాఁగిటఁగూడి మెప్పించీ రతులను
తక్కక చేకొనవయ్యా దయతోను
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి న న్నింతలో
వొక్కమనసున నీవు వుండగదవయ్యా
(||pallavi||)
battiseyam̐gā nīvu parāgu seyam̐garādu
vuttalabu valabu nolalāḍavayyā
(||batti||)
manasu garam̐gi nīdo mām̐ṭalaḍī javarālu
vinavayyā nīvu gaḍuveḍugadonu
vŏnara nappaḍanuṁḍi vŏddane kāsugunnadi
sĕnagi sarasamāḍi sevagŏnavayyā
(||batti||)
salimi balimidoḍa sannalĕllām̐ jesīni
tĕlusugovayā nīvu tem̐kavadonu
kŏluvulusesi ninnum̐ gūrimulu gŏsarīni
pilisi lālanadoḍam̐ briyamaṁdavayyā
(||batti||)
mikkili kām̐giḍam̐gūḍi mĕppiṁchī radulanu
takkaga segŏnavayyā dayadonu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi na nniṁtalo
vŏkkamanasuna nīvu vuṁḍagadavayyā