Battabayalu valabu pasaarimturaa

బట్టబయలు వలపు పచారింతురా
Language

(॥పల్లవి॥)
బట్టబయలు వలపు పచారింతురా
అట్టె యాఁడువారి సిగ్గు లంగడి నమ్ముదురా

(॥బట్ట॥)
పక్కన నాతఁడు నాపానుపుపై నుండఁగాను
గక్కన వచ్చి నీవేమి కానుకిచ్చేవే
చెక్కుచెక్కు సోఁకగఁ జెవిలో మాటలాడేవు
ఇక్కువ నాఁటదానికి ఇంత కాకు గలదా

(॥బట్ట॥)
యెడయక విడెము నాకీతఁ డిచ్చుకుండఁగాను
నడుమ నీవేల వచ్చినవ్వు నవ్వేవే
కడుఁజుట్టరికముతోఁ గదిసి కూచుండేవు
వొడికపుజవరాలి కోజ గొంత వలదా

(॥బట్ట॥)
యే నలమేలుమంగను యీతఁడు శ్రీవేంకటేశుఁ-
డానుక నేమఱఁదల ననేవదేమే
పూరుక నన్నితఁ డేలే పొందులు సేయవచ్చేవు
మానాపతి కిటువంటి మతకము దగునా

(||pallavi||)
baṭṭabayalu valabu pasāriṁturā
aṭṭĕ yām̐ḍuvāri siggu laṁgaḍi nammudurā

(||baṭṭa||)
pakkana nādam̐ḍu nābānububai nuṁḍam̐gānu
gakkana vachchi nīvemi kānugichcheve
sĕkkusĕkku som̐kagam̐ jĕvilo māḍalāḍevu
ikkuva nām̐ṭadānigi iṁta kāgu galadā

(||baṭṭa||)
yĕḍayaga viḍĕmu nāgīdam̐ ḍichchuguṁḍam̐gānu
naḍuma nīvela vachchinavvu navveve
kaḍum̐juṭṭarigamudom̐ gadisi kūsuṁḍevu
vŏḍigabujavarāli koja gŏṁta valadā

(||baṭṭa||)
ye nalamelumaṁganu yīdam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍānuga nemaṟam̐dala nanevademe
pūruga nannidam̐ ḍele pŏṁdulu seyavachchevu
mānābadi kiḍuvaṁṭi madagamu dagunā