బట్టబయలాయ నేఁడు పనులెల్లాను
(॥పల్లవి॥)
బట్టబయలాయ నేఁడు పనులెల్లాను
గుట్టుతోడి తమకము కోరి యెందాఁకానే
(॥బట్ట॥)
సేసపాల వలపులు చెంపలవెంటఁ గారి
లేసులాయఁ జెమటలు లేదనేవేమే
వాసికెక్కి కోరికలు వడ్డివారీఁ బతిమీఁద
మూసి మంతనాలు నాముందర నీకేఁటికే
(॥బట్ట॥)
సిగ్గుతోడి చెలుములు చీరవెంటఁ గారీని
కగ్గుదేరి మోముకళ కాదనేవేమే
బెగ్గోలు మొగమోట పేరడాయ నాతనికి
ముగ్గువంటి నవ్వులు నాముందర నీకేఁటికే
(॥బట్ట॥)
జవ్వనపు వేడుకలు చన్నులవెంటఁగారీ
నివ్వటిల్లీఁ గూటములు నివ్వెరగేలే
చివ్వన మనకూటాలు శ్రీ వేంకటేశ్వరు కబ్బె
మువ్వంక పంతాలు నాముందర నీకేఁటికే
(||pallavi||)
baṭṭabayalāya nem̐ḍu panulĕllānu
guṭṭudoḍi tamagamu kori yĕṁdām̐kāne
(||baṭṭa||)
sesabāla valabulu sĕṁpalavĕṁṭam̐ gāri
lesulāyam̐ jĕmaḍalu ledaneveme
vāsigĕkki korigalu vaḍḍivārīm̐ badimīm̐da
mūsi maṁtanālu nāmuṁdara nīgem̐ṭige
(||baṭṭa||)
siggudoḍi sĕlumulu sīravĕṁṭam̐ gārīni
kagguderi momugaḽa kādaneveme
bĕggolu mŏgamoḍa peraḍāya nādanigi
mugguvaṁṭi navvulu nāmuṁdara nīgem̐ṭige
(||baṭṭa||)
javvanabu veḍugalu sannulavĕṁṭam̐gārī
nivvaḍillīm̐ gūḍamulu nivvĕragele
sivvana managūḍālu śhrī veṁkaḍeśhvaru kabbĕ
muvvaṁka paṁtālu nāmuṁdara nīgem̐ṭige