Bamdugumda vannidaanu padumanaabha vatti

బందుగుఁడ వన్నిటాను పదుమనాభ వట్టి
Language

(॥పల్లవి॥)
బందుగుఁడ వన్నిటాను పదుమనాభ వట్టి
బందెలు గట్టకు మమ్ము పదుమనాభ

(॥బందు॥)
పట్టిన చలపాదివి పదుమనాభ మమ్ము
బట్టబయ లీఁదించేవు పదుమనాభ
పట్టితి బలిమి నన్నుఁ బదుమనాభ యింకా
బట్టము గట్టుకొనేవు పదుమనాభ

(॥బందు॥)
పాటలు వాడేవు యీడ పదుమనాభ ఆ
పాటివారమా విన పదుమనాభ
పాటిగంప నీళ్ళు నించేవు పదుమనాభ బండి
బాటలాయె నీగుట్టు పదుమనాభ

(॥బందు॥)
పలికినట్టే యాయె పదుమనాభ
బలవంతుఁడవు నీవు పదుమనాభ
పలుమారుఁ గూడితివి పదుమనాభ యిదె
పలమా శ్రీవేంకట పదుమనాభ

(||pallavi||)
baṁdugum̐ḍa vanniḍānu padumanābha vaṭṭi
baṁdĕlu gaṭṭagu mammu padumanābha

(||baṁdu||)
paṭṭina salabādivi padumanābha mammu
baṭṭabaya līm̐diṁchevu padumanābha
paṭṭidi balimi nannum̐ badumanābha yiṁkā
baṭṭamu gaṭṭugŏnevu padumanābha

(||baṁdu||)
pāḍalu vāḍevu yīḍa padumanābha ā
pāḍivāramā vina padumanābha
pāḍigaṁpa nīḽḽu niṁchevu padumanābha baṁḍi
bāḍalāyĕ nīguṭṭu padumanābha

(||baṁdu||)
paliginaṭṭe yāyĕ padumanābha
balavaṁtum̐ḍavu nīvu padumanābha
palumārum̐ gūḍidivi padumanābha yidĕ
palamā śhrīveṁkaḍa padumanābha