బలువుఁడు హరిఁ జేపట్టితిని
(॥పల్లవి॥)
బలువుఁడు హరిఁ జేపట్టితిని
తలఁచినదెల్లా దక్కెను నాకు
(॥బలు॥)
దురితధ్వంసుఁడు దుఃఖవిదారుఁడు
అరిభయంకరుఁ డచ్యుతుఁడు
సిరివరుఁ డితనినిఁ జేకొని కొలిచిన
పరమసుఖమెపో భయ మెక్కడిది
(॥బలు॥)
దానవాంతకుఁడు దైవశిఖామణి
మానరక్షకుఁడు మాధవుఁడు
నానాముఖముల నాపాలఁ గలఁడు
యేనెపముల నా కెదురే లేదు
(॥బలు॥)
అనయము నిర్మలుఁ డఖిలానందుఁడు
ఘనుఁ డీశ్రీవేంకటవిభుఁడు
కనుకొని మము నిటు గాచుక తిరిగీ
యెనయఁగ నేలికె యితఁడే మాకు
(||pallavi||)
baluvum̐ḍu harim̐ jebaṭṭidini
talam̐sinadĕllā dakkĕnu nāgu
(||balu||)
duridadhvaṁsum̐ḍu duḥkhavidārum̐ḍu
aribhayaṁkarum̐ ḍachyudum̐ḍu
sirivarum̐ ḍidaninim̐ jegŏni kŏlisina
paramasukhamĕbo bhaya mĕkkaḍidi
(||balu||)
dānavāṁtagum̐ḍu daivaśhikhāmaṇi
mānarakṣhagum̐ḍu mādhavum̐ḍu
nānāmukhamula nābālam̐ galam̐ḍu
yenĕbamula nā kĕdure ledu
(||balu||)
anayamu nirmalum̐ ḍakhilānaṁdum̐ḍu
ghanum̐ ḍīśhrīveṁkaḍavibhum̐ḍu
kanugŏni mamu niḍu gāsuga tirigī
yĕnayam̐ga neligĕ yidam̐ḍe māgu