(॥పల్లవి॥)
బలువగుఁ దనరూపము చూపెన్
కలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్
(॥బలు॥)
పాండవరక్షణపరుఁడై నరునకు
నండనే తెలిపె మహమహిమ
దండి విడిచి తనదయతో నర్జునుఁ-
డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె
(॥బలు॥)
మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములు
తెగి పార్ధున కుపదేశించె
నగుచు నతనితో నానాగతులను
నిగమమునియమమునిజ మెరిఁగించెన్
(॥బలు॥)
వెరపుమిగుల నావిజయునిమనుమని
పరీక్షిత్తుఁ దగఁ బ్రదికించె
తిరువేంకటగిరిదేవుఁడు దానై
గరిమల బారతకథ గలిగించెన్
(||pallavi||)
baluvagum̐ danarūbamu sūbĕn
kaladiṁtayum̐ danaghana tĕṟim̐giṁchĕn
(||balu||)
pāṁḍavarakṣhaṇabarum̐ḍai narunagu
naṁḍane tĕlibĕ mahamahima
daṁḍi viḍisi tanadayado narjunum̐-
ḍuṁḍam̐ga magaḍimi nŏḍam̐baḍam̐ baligĕ
(||balu||)
maguḍam̐ga kuladharmamulum̐ buṇyamulu
tĕgi pārdhuna kubadeśhiṁchĕ
nagusu nadanido nānāgadulanu
nigamamuniyamamunija mĕrim̐giṁchĕn
(||balu||)
vĕrabumigula nāvijayunimanumani
parīkṣhittum̐ dagam̐ bradigiṁchĕ
tiruveṁkaḍagiridevum̐ḍu dānai
garimala bāradagatha galigiṁchĕn