Baluvagu karmamu livivo jeevula praarabdhambulu samchidambulunu

బలువగు కర్మము లివివో జీవుల ప్రారబ్ధంబులు సంచితంబులును
Language

(॥పల్లవి॥)
బలువగు కర్మము లివివో జీవుల ప్రారబ్ధంబులు సంచితంబులును
బలిసి తీరవివి పెరుగునేకాని బ్రహ్మల బహుకల్పంబులదాఁక

(॥బలు॥)
పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై
యేయెడఁజూచిన నెదిటికొలుచులై యిచ్చల నిటు భజియించఁగను
కాయపుఁ బెడతటిగండఁడు విధి, దనుఁగడ తేర్చిన తనకడకర్మములు
పోయి సంచితంబులఁ గలసిన, నవి పొదలుచుఁ గొండలపొడవై పెరుగు

(॥బలు॥)
పొదలి సంచితంబులు వడిఁబెరుగును పొలియును జీవునిపుణ్యముఁ జాలక
యెదిగినపుణ్యం బిగురును కాఁగినయినుముమీఁదిజలములవలెను
పదిలములై కడుఁబాపకర్మములే బరువై పరగఁగఁ బ్రాణికి నెన్నఁడు
తుదయు మొదలు నెందును లేక, వడిఁ దొలఁగక భవములతొడవై తిరుగు

(॥బలు॥)
తలఁపులో నవయఁదలఁచినజంతువు, కలుషహరుఁడు వేంకటగిరిపతి దను
దలఁచుభాగ్య మాత్మకు నొసగినఁ, జిత్తము పరిపక్వంబై యెపుడు
జలజోదరుదలఁచఁగఁబ్రారబ్దంబులు సంచితంబులుఁ బొలసి పుణ్యులై
చెలువగునిత్యానందపదంబునఁ జెలఁగి సుఖించగఁ జేరుదు రపుడు

(||pallavi||)
baluvagu karmamu livivo jīvula prārabdhaṁbulu saṁchidaṁbulunu
balisi tīravivi pĕrugunegāni brahmala bahugalbaṁbuladām̐ka

(||balu||)
pāyanijanmaṁbulagarmaṁbulu pāyaga jīvula prārabdhamulai
yeyĕḍam̐jūsina nĕdiḍigŏlusulai yichchala niḍu bhajiyiṁcham̐ganu
kāyabum̐ bĕḍadaḍigaṁḍam̐ḍu vidhi, danum̐gaḍa tersina tanagaḍagarmamulu
poyi saṁchidaṁbulam̐ galasina, navi pŏdalusum̐ gŏṁḍalabŏḍavai pĕrugu

(||balu||)
pŏdali saṁchidaṁbulu vaḍim̐bĕrugunu pŏliyunu jīvunibuṇyamum̐ jālaga
yĕdiginabuṇyaṁ bigurunu kām̐ginayinumumīm̐dijalamulavalĕnu
padilamulai kaḍum̐bābagarmamule baruvai paragam̐gam̐ brāṇigi nĕnnam̐ḍu
tudayu mŏdalu nĕṁdunu lega, vaḍim̐ dŏlam̐gaga bhavamuladŏḍavai tirugu

(||balu||)
talam̐pulo navayam̐dalam̐sinajaṁtuvu, kaluṣhaharum̐ḍu veṁkaḍagiribadi danu
dalam̐subhāgya mātmagu nŏsaginam̐, jittamu paribakvaṁbai yĕbuḍu
jalajodarudalam̐sam̐gam̐brārabdaṁbulu saṁchidaṁbulum̐ bŏlasi puṇyulai
sĕluvagunityānaṁdabadaṁbunam̐ jĕlam̐gi sukhiṁchagam̐ jerudu rabuḍu