బలువాఁడవయ్యా భామల రొచ్చు కోర్చితి
(॥పల్లవి॥)
బలువాఁడవయ్యా భామల రొచ్చు కోర్చితి
పలువై యెందరి పాలఁ బరగె నీ మేను
(॥॥)
కందువ సతుల నీకుఁ గడుఁ గడు మొక్కఁ గాను
యెందరితలలు మోచె నీపాదాలు
అంది వూడిగాలు నీకు నందరునుఁ జేయఁగాను
సందడి కెట్టోరిచె నీచక్కని మేను
(॥॥)
కన్నెలెవ్వరైనా నిన్నుఁ గాఁగిలించు కొనఁగాను
యెన్ని చన్నులు సోఁకెను యీచేతులు
సన్నల మాటలాడి సారెఁ దమ్ములా లిడఁగ
వున్నతి నెంగలి కెట్టు వొనరె నీమోవి
(॥॥)
ఱట్టడి కామినుల యాఱడి పసలనుఁ జొక్కి
యెట్టు తగులు వడెను యీ మనసు
అట్టె శ్రీవేంకటేశుడ వలమేల్మంగను నన్ను
గట్టిగా నేలుకొంటివి ఘనుఁడవు నీవు
(||pallavi||)
baluvām̐ḍavayyā bhāmala rŏchchu korsidi
paluvai yĕṁdari pālam̐ baragĕ nī menu
(||||)
kaṁduva sadula nīgum̐ gaḍum̐ gaḍu mŏkkam̐ gānu
yĕṁdaridalalu mosĕ nībādālu
aṁdi vūḍigālu nīgu naṁdarunum̐ jeyam̐gānu
saṁdaḍi kĕṭṭorisĕ nīsakkani menu
(||||)
kannĕlĕvvarainā ninnum̐ gām̐giliṁchu kŏnam̐gānu
yĕnni sannulu som̐kĕnu yīsedulu
sannala māḍalāḍi sārĕm̐ dammulā liḍam̐ga
vunnadi nĕṁgali kĕṭṭu vŏnarĕ nīmovi
(||||)
ṟaṭṭaḍi kāminula yāṟaḍi pasalanum̐ jŏkki
yĕṭṭu tagulu vaḍĕnu yī manasu
aṭṭĕ śhrīveṁkaḍeśhuḍa valamelmaṁganu nannu
gaṭṭigā nelugŏṁṭivi ghanum̐ḍavu nīvu