Balumulu soobamgam bani ledu

బలుములు చూపఁగఁ బని లేదు
Language

(॥పల్లవి॥)
బలుములు చూపఁగఁ బని లేదు
ఫలభోగము లవి భాగ్యము కొలఁదీ

(॥॥)
వంతుకు నీ కిటు వలచిన మాకును
పంతము లాడఁగఁ బని లేదు
కాంతుఁ డని వేళ గాచుకుండఁగా
బంతుల నీ కృప భాగ్యము కొలఁదీ

(॥॥)
యిచ్చకురాలనై యి టుండ నాకును
పచ్చి సేయ నినుఁ బని లేదు
చెచ్చెర నీ సేవ సేసు కుండఁగా
బచ్చెన ముదములు భాగ్యముకొలఁదీ

(॥॥)
తగిలి నీ కౌఁగిట తనిసిన మాకును
బగివాయఁగ నిఁకఁ బని లేదు
అగడుగ శ్రీ వేంకటాధిప కూడితి
పగటు రతులు మా భాగ్యము కొలఁదీ.

(||pallavi||)
balumulu sūbam̐gam̐ bani ledu
phalabhogamu lavi bhāgyamu kŏlam̐dī

(||||)
vaṁtugu nī kiḍu valasina māgunu
paṁtamu lāḍam̐gam̐ bani ledu
kāṁtum̐ ḍani veḽa gāsuguṁḍam̐gā
baṁtula nī kṛpa bhāgyamu kŏlam̐dī

(||||)
yichchagurālanai yi ṭuṁḍa nāgunu
pachchi seya ninum̐ bani ledu
sĕchchĕra nī seva sesu kuṁḍam̐gā
bachchĕna mudamulu bhāgyamugŏlam̐dī

(||||)
tagili nī kaum̐giḍa tanisina māgunu
bagivāyam̐ga nim̐kam̐ bani ledu
agaḍuga śhrī veṁkaḍādhiba kūḍidi
pagaḍu radulu mā bhāgyamu kŏlam̐dī.