బలుపు కొలఁదియే పో పంత మెల్లాను
(॥పల్లవి॥)
బలుపు కొలఁదియే పో పంత మెల్లాను
వెలిఁ దారుకాణలతో విన్నవించఁగలనా
(॥బలు॥)
చెక్కే నొక్కితివిగాని చేతిగోర నూఁది తేను
ఇక్కడ నౌఁగాదనేవారెవ్వరు నిన్ను
ముక్కుమీఁది వేలితోడ ములిగేటిదానఁగాక
పెక్కుమాటలాడి నీతోఁ బెనంగఁగఁగలనా
(॥బలు॥)
మంచిమాటాడితిగాని మానము పైఁ దిట్టితేను
యెంచి తగవుచెప్పేవారెవ్వరు నీకు
వంచినశిరసుతోడ వగచేటిదానఁగాక
పంచల నీగుట్టులెల్లఁ బచ్చి సేయఁగలనా
(॥బలు॥)
కాలుదొక్కితివిగాని కడచేఁత సేసితేను
పోలదని యెవ్వరైనా బుద్దిచెప్పేరా
మేలిమి శ్రీవేంకటేశ మెచ్చఁగూడఁగలఁగాక
వేళవేళఁ గూడఁగానే వేగిరించఁగలనా
(||pallavi||)
balubu kŏlam̐diye po paṁta mĕllānu
vĕlim̐ dārugāṇalado vinnaviṁcham̐galanā
(||balu||)
sĕkke nŏkkidivigāni sedigora nūm̐di tenu
ikkaḍa naum̐gādanevārĕvvaru ninnu
mukkumīm̐di velidoḍa muligeḍidānam̐gāga
pĕkkumāḍalāḍi nīdom̐ bĕnaṁgam̐gam̐galanā
(||balu||)
maṁchimāḍāḍidigāni mānamu paim̐ diṭṭidenu
yĕṁchi tagavusĕppevārĕvvaru nīgu
vaṁchinaśhirasudoḍa vagaseḍidānam̐gāga
paṁchala nīguṭṭulĕllam̐ bachchi seyam̐galanā
(||balu||)
kāludŏkkidivigāni kaḍasem̐ta sesidenu
poladani yĕvvarainā buddisĕpperā
melimi śhrīveṁkaḍeśha mĕchcham̐gūḍam̐galam̐gāga
veḽaveḽam̐ gūḍam̐gāne vegiriṁcham̐galanā