బలిమిసేయఁగఁబోతే పాటివట్ట రెవ్వరును
(॥పల్లవి॥)
బలిమిసేయఁగఁబోతే పాటివట్ట రెవ్వరును
తలఁపు సరివచ్చితే దగ్గరి రారాదా
(॥బలి॥)
నను పందరికి సరే నాకు నీకే పాలు గాదు
మనసు లెనసి మరి మరఁగేఁటికి
అనుమానము గలిగితే నందరి నడుగవయ్య
వనితలమాట విని వద్దికి రావయ్యా
(॥బలి॥)
తమి యిందరికిఁ గద్దు తగ మనలోనే రాదు
అమరఁ బైకొని మరి అడ్డమేఁటికి
భ్రమసితేఁగన వద్దిపడఁతుల విచారించు
క్రమమై వుంటిఁగాన పొంకానకు రావయ్యా
(॥బలి॥)
కూట మిందరికిఁ గద్దు గురుతు ఇద్దరికే కాదు
వాఁటముఁగా గలసియు వరుసేఁటికి
గాఁటపు శ్రీవేంకటేశ కాంతలకు సమ్మతమే
యీటుదొరశుండితేను ఇంకా రావయ్యా
(||pallavi||)
balimiseyam̐gam̐bode pāḍivaṭṭa rĕvvarunu
talam̐pu sarivachchide daggari rārādā
(||bali||)
nanu paṁdarigi sare nāgu nīge pālu gādu
manasu lĕnasi mari maram̐gem̐ṭigi
anumānamu galigide naṁdari naḍugavayya
vanidalamāḍa vini vaddigi rāvayyā
(||bali||)
tami yiṁdarigim̐ gaddu taga manalone rādu
amaram̐ baigŏni mari aḍḍamem̐ṭigi
bhramasidem̐gana vaddibaḍam̐tula visāriṁchu
kramamai vuṁṭim̐gāna pŏṁkānagu rāvayyā
(||bali||)
kūḍa miṁdarigim̐ gaddu gurudu iddarige kādu
vām̐ṭamum̐gā galasiyu varusem̐ṭigi
gām̐ṭabu śhrīveṁkaḍeśha kāṁtalagu sammadame
yīḍudŏraśhuṁḍidenu iṁkā rāvayyā