Balimi yemta sesinaam banigiraadu

బలిమి యెంత సేసినాఁ బనికిరాదు
Language

(॥పల్లవి॥)
బలిమి యెంత సేసినాఁ బనికిరాదు
అలరఁగ నిచ్చకము లాడవలెఁగాని

(॥బలి॥)
అటమటములవాని నౌఁగాదనఁగరాదు
సటలాడేవాని సాదించరాదు
విటతనములవాని వేమారుఁ గొసరరాదు
చిటుకురంటే సేవసేయవలెఁగాని

(॥బలి॥)
తూఁటరివిద్యలవాని దూరితేఁ బనికిరాదు
జూటుఁదనములవాని సొలయరాదు
మాటకుమాటాడేవాని మారుకొనఁగరాదు
మూఁటకట్టువినయాన మొక్కవలెఁగాని

(॥బలి॥)
పంతగారివానిని పచ్చిగా నాడఁగరాదు
అంతరంగమైనవాని నణఁచరాదా
ఇంతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను మెచ్చి
వింతసేయరాదు నిన్ను వేఁడుకోవలెఁగాని

(||pallavi||)
balimi yĕṁta sesinām̐ banigirādu
alaram̐ga nichchagamu lāḍavalĕm̐gāni

(||bali||)
aḍamaḍamulavāni naum̐gādanam̐garādu
saḍalāḍevāni sādiṁcharādu
viḍadanamulavāni vemārum̐ gŏsararādu
siḍuguraṁṭe sevaseyavalĕm̐gāni

(||bali||)
tūm̐ṭarividyalavāni dūridem̐ banigirādu
jūḍum̐danamulavāni sŏlayarādu
māḍagumāḍāḍevāni mārugŏnam̐garādu
mūm̐ṭagaṭṭuvinayāna mŏkkavalĕm̐gāni

(||bali||)
paṁtagārivānini pachchigā nāḍam̐garādu
aṁtaraṁgamainavāni naṇam̐sarādā
iṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu mĕchchi
viṁtaseyarādu ninnu vem̐ḍugovalĕm̐gāni