బలిమి సేయఁగరాదు పడఁతులా బురుషులా
(॥పల్లవి॥)
బలిమి సేయఁగరాదు పడఁతులా బురుషులా
చెలులాల యిదెరిఁగి చేరి పొందుసేయరే
(॥బలి॥)
మనసొక్కటైతేను మాటలూ నొక్కటే యౌను
తను వోరుచుకుంటేను తలఁవూ నోరుచును
కనుఁగన కింపైతేను కడుపున కింపౌను
పనులకు మెచ్చేవారు పాటలకూ మెత్తురు
(॥బలి॥)
చేతికి లోనైతేను చేఁతలకూ లోనౌను
ఆతుమకుఁ దగులైతే అసలుకూఁ దగులు
నీతులు సమకూడితే నిజములూ సమకూడు
కాతర మొల్లనివారు కపటమూ నొల్లరు
(॥బలి॥)
పిన్ననాఁడు గుణియైతే పెద్దనాఁడూ గుణియౌను
నన్నుఁ దాఁ గూడెఁగనక నవ్వు లొనగూడెను
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
మన్నింపించుకొన్నవారు మరిగించుకొందురు
(||pallavi||)
balimi seyam̐garādu paḍam̐tulā buruṣhulā
sĕlulāla yidĕrim̐gi seri pŏṁduseyare
(||bali||)
manasŏkkaḍaidenu māḍalū nŏkkaḍe yaunu
tanu vorusuguṁṭenu talam̐vū norusunu
kanum̐gana kiṁpaidenu kaḍubuna kiṁpaunu
panulagu mĕchchevāru pāḍalagū mĕtturu
(||bali||)
sedigi lonaidenu sem̐talagū lonaunu
ādumagum̐ dagulaide asalugūm̐ dagulu
nīdulu samagūḍide nijamulū samagūḍu
kādara mŏllanivāru kabaḍamū nŏllaru
(||bali||)
pinnanām̐ḍu guṇiyaide pĕddanām̐ḍū guṇiyaunu
nannum̐ dām̐ gūḍĕm̐ganaga navvu lŏnagūḍĕnu
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
manniṁpiṁchugŏnnavāru marigiṁchugŏṁduru