బలిమి సేయఁగ నీతోఁ బంతమా నాకు
(॥పల్లవి॥)
బలిమి సేయఁగ నీతోఁ బంతమా నాకు
పలచఁగా నిన్ను నాడఁ బంతమా నాకు
(॥బలిమి॥)
యిట్టె నీసతులు యే ముందురో అని కాక
పట్టకు మని కోపించఁ బంతమా నాకు
చుట్టుకొన్న నీతగవు చూడవల సింతే కాక
బట్టబయ లీదించఁ బంతమా నాకు
(॥బలిమి॥)
మోసాన నెవ్వతె కైనా మొక మోడే వని కాక
పాసి వేరే మంచ మెక్కఁ బంతమా నాకు
వాసుల నీ మతిలోని వల పెరఁగక కాక
బాసలు నిన్నుఁ జేయించఁ బంతమా నాకు
(॥బలిమి॥)
ఆడిరి మరి నొకతె నాసపడీ నని కాక
బడలించి రతి సేయఁ బంతమా నాకు
వడి శ్రీవెంకటేశుఁడ వా నలయేలుమంగను
బడి వాయ నియ్యకుండఁ బంతమా నాకూ
(||pallavi||)
balimi seyam̐ga nīdom̐ baṁtamā nāgu
palasam̐gā ninnu nāḍam̐ baṁtamā nāgu
(||balimi||)
yiṭṭĕ nīsadulu ye muṁduro ani kāga
paṭṭagu mani kobiṁcham̐ baṁtamā nāgu
suṭṭugŏnna nīdagavu sūḍavala siṁte kāga
baṭṭabaya līdiṁcham̐ baṁtamā nāgu
(||balimi||)
mosāna nĕvvadĕ kainā mŏga moḍe vani kāga
pāsi vere maṁcha mĕkkam̐ baṁtamā nāgu
vāsula nī madiloni vala pĕram̐gaga kāga
bāsalu ninnum̐ jeyiṁcham̐ baṁtamā nāgu
(||balimi||)
āḍiri mari nŏgadĕ nāsabaḍī nani kāga
baḍaliṁchi radi seyam̐ baṁtamā nāgu
vaḍi śhrīvĕṁkaḍeśhum̐ḍa vā nalayelumaṁganu
baḍi vāya niyyaguṁḍam̐ baṁtamā nāgū