Balimi seyagure patti penamgagure

బలిమి సేయకురే పట్టి పెనఁగకురే
Language

(॥పల్లవి॥)
బలిమి సేయకురే పట్టి పెనఁగకురే
పొలసి పో వచ్చినాఁడు పోనియ్యఁ గదరే

(॥బలిమి॥)
కొసరే మా మాటలు కూరిములో తేటలు
నసలు నేఁ డిం పౌనా నాఁడే కాక
వస మైనాఁ డెవ్వతెకో వలసీ నొల్లము లీడఁ
బొసఁగీనా వాని కట్టె పోనియ్యఁ గదరే

(॥బలిమి॥)
రవ్వల మా పిలుపులు రాయిడించే సొలపులు
నవ్వులు నేఁ డిం పౌనా నాఁడే కాక
యేవ్వ తాస యిచ్చనదో యింతకు నేరఁడు తొల్లి
పువ్వువంటిది వలపు పోనియ్యఁ గదరే

(॥బలిమి॥)
తనవోనిరతులనును తలపోఁతమతులును
ననుపు నే డిం పౌనా నాఁడే కాక
యెననెను శ్రీవెంకటేశుఁడింత సేసి నన్ను
పొనిగి పోయినసుద్ది పోనియ్యఁ గదరే

(||pallavi||)
balimi seyagure paṭṭi pĕnam̐gagure
pŏlasi po vachchinām̐ḍu poniyyam̐ gadare

(||balimi||)
kŏsare mā māḍalu kūrimulo teḍalu
nasalu nem̐ ḍiṁ paunā nām̐ḍe kāga
vasa mainām̐ ḍĕvvadĕgo valasī nŏllamu līḍam̐
bŏsam̐gīnā vāni kaṭṭĕ poniyyam̐ gadare

(||balimi||)
ravvala mā pilubulu rāyiḍiṁche sŏlabulu
navvulu nem̐ ḍiṁ paunā nām̐ḍe kāga
yevva tāsa yichchanado yiṁtagu neram̐ḍu tŏlli
puvvuvaṁṭidi valabu poniyyam̐ gadare

(||balimi||)
tanavoniradulanunu talabom̐tamadulunu
nanubu ne ḍiṁ paunā nām̐ḍe kāga
yĕnanĕnu śhrīvĕṁkaḍeśhum̐ḍiṁta sesi nannu
pŏnigi poyinasuddi poniyyam̐ gadare