బలిమి సేయకు మిఁక పచ్చిదేరీని
(॥పల్లవి॥)
బలిమి సేయకు మిఁక పచ్చిదేరీని
తిలకించి చూచితే నే దీకొనేనా
(॥॥)
కడుఁ బెనఁగకు మేనిగందపుబేంట్లు రాలీ
వొడివట్టి తియ్యకు నవ్వులు వచ్చీని
పిడికిటితలఁ బాల పెండ్లికూఁతురను నేను
యెడయక నీ వెట్టున్నా యెగ్గులెంచేనా
(॥॥)
బెట్టిమాట లాడకు పెదవి కెంపులు రేఁగీ
మట్టుమీరి చూడకు మర్మము లంటీని
పట్టపుదేవులనైన పాయరానిసతి నేను
చుట్టము వెందరికైనా సూడువట్టేనా
(॥॥)
పందెములు వేయకు పైపై సందు లదరీ
సందు లంత దూర కలసత లుబ్బీని
కందుల శ్రీ వేంకటేశ కలసినసతి నేను
విందు లెందు చేకొనినా వెంగెములాడేనా
(||pallavi||)
balimi seyagu mim̐ka pachchiderīni
tilagiṁchi sūside ne dīgŏnenā
(||||)
kaḍum̐ bĕnam̐gagu menigaṁdabubeṁṭlu rālī
vŏḍivaṭṭi tiyyagu navvulu vachchīni
piḍigiḍidalam̐ bāla pĕṁḍligūm̐turanu nenu
yĕḍayaga nī vĕṭṭunnā yĕggulĕṁchenā
(||||)
bĕṭṭimāḍa lāḍagu pĕdavi kĕṁpulu rem̐gī
maṭṭumīri sūḍagu marmamu laṁṭīni
paṭṭabudevulanaina pāyarānisadi nenu
suṭṭamu vĕṁdarigainā sūḍuvaṭṭenā
(||||)
paṁdĕmulu veyagu paibai saṁdu ladarī
saṁdu laṁta dūra kalasada lubbīni
kaṁdula śhrī veṁkaḍeśha kalasinasadi nenu
viṁdu lĕṁdu segŏninā vĕṁgĕmulāḍenā