Balimi seyaga padavammaa

బలిమి సేయక పదవమ్మా
Language

(॥పల్లవి॥)
బలిమి సేయక పదవమ్మా
చెలియ నా మన విది చేకొనవమ్మా

(॥బలి॥)
ననుపు లేనిచోట నవ్వుకంటెను
జునిఁగి వాదులడుఁచుట సుఖము
మనసురానిచోట మాటలాడుట కంటె
మునుపనే తనలోన మానమే సుఖము

(॥బలి॥)
ప్రేమలేనిపతిఁ బిలుటకంటెను
సోమరై వేగించుట సుఖము
కామించనిరతిఁ గరఁగుటకంటె
ఆమారు కంబము నలముట సుఖము

(॥బలి॥)
వొల్లమి సరిఁగూచుండుటకంటె
చల్లఁగ దొలఁగుట సమ సుఖము
యెల్లగ శ్రీవేంకటేశుఁడు నన్నుఁ గూడె
కొల్లగ నిదియే కోరుట సుఖము

(||pallavi||)
balimi seyaga padavammā
sĕliya nā mana vidi segŏnavammā

(||bali||)
nanubu lenisoḍa navvugaṁṭĕnu
junim̐gi vādulaḍum̐suḍa sukhamu
manasurānisoḍa māḍalāḍuḍa kaṁṭĕ
munubane tanalona māname sukhamu

(||bali||)
premalenibadim̐ biluḍagaṁṭĕnu
somarai vegiṁchuḍa sukhamu
kāmiṁchaniradim̐ garam̐guḍagaṁṭĕ
āmāru kaṁbamu nalamuḍa sukhamu

(||bali||)
vŏllami sarim̐gūsuṁḍuḍagaṁṭĕ
sallam̐ga dŏlam̐guḍa sama sukhamu
yĕllaga śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ gūḍĕ
kŏllaga nidiye koruḍa sukhamu