బలిమి జేయఁగనేల పరపుపై నున్నదాన
(॥పల్లవి॥)
బలిమి జేయఁగనేల పరపుపై నున్నదాన
నలువంకలుఁ జూచితే నవ్వురాదా నాకు
(॥॥)
మునుకొన్న నాగుణములు పొగడేవుగాని
వినరాదా నామాట వింతగాను
చనవిచ్చి సతులతో జాణతనాలాడుతానే
ననుపు నాతోఁ జేసితే నమ్మికౌనా నాకు
(॥॥)
జాడ దప్పకుండా నాతో సరసాలాడేవుగాని
చూడరాదా నాదిక్కు సూటితోడను
కోడెకాఁడవై సందడికొలువులో నుండుతానే
వోడక నన్ను మెచ్చితే నొద్దికౌనా నాకు
(॥॥)
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టె మన్నింతువుగాని
రారాదా యింటిలోనికి రాఁపు సేయక
సారెఁ జెలికత్తెల కాసలెల్లాఁ జూపుతానే
వోరలేక కూడితేనే వొడబాటా నాకు
(||pallavi||)
balimi jeyam̐ganela parabubai nunnadāna
naluvaṁkalum̐ jūside navvurādā nāgu
(||||)
munugŏnna nāguṇamulu pŏgaḍevugāni
vinarādā nāmāḍa viṁtagānu
sanavichchi sadulado jāṇadanālāḍudāne
nanubu nādom̐ jeside nammigaunā nāgu
(||||)
jāḍa dappaguṁḍā nādo sarasālāḍevugāni
sūḍarādā nādikku sūḍidoḍanu
koḍĕgām̐ḍavai saṁdaḍigŏluvulo nuṁḍudāne
voḍaga nannu mĕchchide nŏddigaunā nāgu
(||||)
yīrīdi śhrī veṁkaḍeśha yiṭṭĕ manniṁtuvugāni
rārādā yiṁṭilonigi rām̐pu seyaga
sārĕm̐ jĕligattĕla kāsalĕllām̐ jūbudāne
voralega kūḍidene vŏḍabāḍā nāgu