Balimaaya imka nitte badugarammaa

బలిమాయ ఇఁక నిట్టే బతుకరమ్మా
Language

(॥పల్లవి॥)
బలిమాయ ఇఁక నిట్టే బతుకరమ్మా
తలమోచి సవతులు దగ్గరఁ జోటేది

(॥బలి॥)
ఇచ్చక మాతఁ డాడితే నియ్యకొందువు నీవైతే
హెచ్చిన నేరుపరులే ఇద్దరును
పచ్చిదోఁచె మీమోవుల పనులెల్లఁ జక్కనాయ
తచ్చి సవతుల కిఁకఁ దగులఁజోటేది

(॥బలి॥)
సన్న నాతఁడు చూచితే సారె మొక్కుదువు నీవు
ఇన్నిటా జాణలే మీరిద్దురును
కన్నులఁ దేటలు నిండె కాయములు పులకించె
కన్నవిన్నసవతులు కలయఁజోటేది

(॥బలి॥)
శ్రీవేంకటేశ్వరుఁ డేలె సేవ సేసితివి నీవు
యీవల నావల ఘనులిద్దరును
వావి చూచి నన్నుఁ గూడె వరుస వితఁడే నేఁడు
భావించి సవతులిఁకఁ బదరఁజోటేది

(||pallavi||)
balimāya im̐ka niṭṭe badugarammā
talamosi savadulu daggaram̐ joḍedi

(||bali||)
ichchaga mādam̐ ḍāḍide niyyagŏṁduvu nīvaide
hĕchchina nerubarule iddarunu
pachchidom̐sĕ mīmovula panulĕllam̐ jakkanāya
tachchi savadula kim̐kam̐ dagulam̐joḍedi

(||bali||)
sanna nādam̐ḍu sūside sārĕ mŏkkuduvu nīvu
inniḍā jāṇale mīriddurunu
kannulam̐ deḍalu niṁḍĕ kāyamulu pulagiṁchĕ
kannavinnasavadulu kalayam̐joḍedi

(||bali||)
śhrīveṁkaḍeśhvarum̐ ḍelĕ seva sesidivi nīvu
yīvala nāvala ghanuliddarunu
vāvi sūsi nannum̐ gūḍĕ varusa vidam̐ḍe nem̐ḍu
bhāviṁchi savadulim̐kam̐ badaram̐joḍedi