బళి బళి దేవుఁడా బాపు బాపు మాయా
(॥పల్లవి॥)
బళి బళి దేవుఁడా బాపు బాపు మాయా
యెలమి యింతేసి సేసి యేమి సేకొంటివి
(॥బళి॥)
కలిమి యొక్కనికి కడు లేమి యొక్కనికి
యిల నిందరు జీవులే యేల వచ్చెను
బలవంతుఁడొకఁడూ బలహీనుఁడొకఁడూ
మొలపించి భ్రమ నేల ముంచేరు మీరు
(॥బళి॥)
వొకచోట రాజసము వొకచోట బంటరికము
అకటా దేహాలు మోచినంతలోననే
పకపక నవ్వులు బయములు వేరెవేరె
సకల జీవులమీఁద చల్లేరు మీరు
(॥బళి॥)
శరణు నీకంటేనె జారె నా పాపములు
సరవుల రెండు నీ జగములోన
గరిమ శ్రీ వేంకటేశ కరుణించితివి నన్ను
దరి చేర్చి నీ మాయ దాసుఁడ నేఁగనక
(||pallavi||)
baḽi baḽi devum̐ḍā bābu bābu māyā
yĕlami yiṁtesi sesi yemi segŏṁṭivi
(||baḽi||)
kalimi yŏkkanigi kaḍu lemi yŏkkanigi
yila niṁdaru jīvule yela vachchĕnu
balavaṁtum̐ḍŏgam̐ḍū balahīnum̐ḍŏgam̐ḍū
mŏlabiṁchi bhrama nela muṁcheru mīru
(||baḽi||)
vŏgasoḍa rājasamu vŏgasoḍa baṁṭarigamu
agaḍā dehālu mosinaṁtalonane
pagabaga navvulu bayamulu verĕverĕ
sagala jīvulamīm̐da salleru mīru
(||baḽi||)
śharaṇu nīgaṁṭenĕ jārĕ nā pābamulu
saravula rĕṁḍu nī jagamulona
garima śhrī veṁkaḍeśha karuṇiṁchidivi nannu
dari sersi nī māya dāsum̐ḍa nem̐ganaga