Balavamtumdavu tolle padi vamdumeemdada

బలవంతుఁడవు తొల్లే పతి వందుమీఁదట
Language

(॥పల్లవి॥)
బలవంతుఁడవు తొల్లే పతి వందుమీఁదట
చలపట్టి నిన్నుఁ గడు జరయంగఁ గలనా

(॥బల॥)
పంతములు నావంటి పడఁతులతోఁ గాక
కాంతుడవు నీతో నాడఁగలనా నేను
పొంతనుండి నీవెవ్వరిఁ బోలించినా నందుకెల్లా
సంతోసించుకొందుఁ గాక సాదించఁ గలనా

(॥బల॥)
యెగసక్కే లెల్లాను నాయీడువారితోఁ గాక
మగఁడవు నీతోఁ జేయ మందెమేళమా
తగ వెరఁగ కెవ్వతెదండ నీవు వెట్టినాను
నగుచుండుదుఁ గాక మిన్నక దూరఁ గలనా

(॥బల॥)
లావులెల్ల నాసవతిలలనల తోనే కాక
శ్రీవేంకటేశ నీపైఁ జేయ వచ్చునా
ఆవటించి నీదేవిని అలమేల్మంగనే నేను
వావి దెలుపుదుఁ గాక వదలఁగఁ గలనా

(||pallavi||)
balavaṁtum̐ḍavu tŏlle padi vaṁdumīm̐daḍa
salabaṭṭi ninnum̐ gaḍu jarayaṁgam̐ galanā

(||bala||)
paṁtamulu nāvaṁṭi paḍam̐tuladom̐ gāga
kāṁtuḍavu nīdo nāḍam̐galanā nenu
pŏṁtanuṁḍi nīvĕvvarim̐ boliṁchinā naṁdugĕllā
saṁtosiṁchugŏṁdum̐ gāga sādiṁcham̐ galanā

(||bala||)
yĕgasakke lĕllānu nāyīḍuvāridom̐ gāga
magam̐ḍavu nīdom̐ jeya maṁdĕmeḽamā
taga vĕram̐ga kĕvvadĕdaṁḍa nīvu vĕṭṭinānu
nagusuṁḍudum̐ gāga minnaga dūram̐ galanā

(||bala||)
lāvulĕlla nāsavadilalanala tone kāga
śhrīveṁkaḍeśha nībaim̐ jeya vachchunā
āvaḍiṁchi nīdevini alamelmaṁgane nenu
vāvi dĕlubudum̐ gāga vadalam̐gam̐ galanā