బలవంతుఁ డితనిబంట్లమై బ్రతుకుదుము
(॥పల్లవి॥)
బలవంతుఁ డితనిబంట్లమై బ్రతుకుదుము
కిలకిల నవ్వీ సుగ్రీవనరసింహుఁడు
(॥॥)
దేవదేవుఁ డితఁడు తేజోరాశి యితఁడు
భావించ నలవిగానిబహ్మ మీతఁడు
శ్రీవల్లభుఁ డితఁడు జీవరక్షకుఁ డితఁడు
కేవలమయిన సుగ్రీవనరసింహుఁడు
(॥॥)
పరమాత్ముఁడితఁడు భయహరుఁ డితఁడు
నిరుపమగుణముల నిత్యుఁ డితఁడు
వరదుఁ డితఁడు సర్వవంద్యుఁడు నీతఁడు
గిరిగుహలోనిసుగ్రీవనరసింహుఁడు
(॥॥)
కాలరూపుఁ డితఁడు కరుణానిధి ఇతఁడు
మేలిమిజగత్తులకు మేఁటి యీతఁడు
మూలమై శ్రీవేంకటేశై లనిలయుఁ డితఁడు
కీలక మిన్నిటికి సుగ్రీవనరసింహుఁడు
(||pallavi||)
balavaṁtum̐ ḍidanibaṁṭlamai bradugudumu
kilagila navvī sugrīvanarasiṁhum̐ḍu
(||||)
devadevum̐ ḍidam̐ḍu tejorāśhi yidam̐ḍu
bhāviṁcha nalavigānibahma mīdam̐ḍu
śhrīvallabhum̐ ḍidam̐ḍu jīvarakṣhagum̐ ḍidam̐ḍu
kevalamayina sugrīvanarasiṁhum̐ḍu
(||||)
paramātmum̐ḍidam̐ḍu bhayaharum̐ ḍidam̐ḍu
nirubamaguṇamula nityum̐ ḍidam̐ḍu
varadum̐ ḍidam̐ḍu sarvavaṁdyum̐ḍu nīdam̐ḍu
giriguhalonisugrīvanarasiṁhum̐ḍu
(||||)
kālarūbum̐ ḍidam̐ḍu karuṇānidhi idam̐ḍu
melimijagattulagu mem̐ṭi yīdam̐ḍu
mūlamai śhrīveṁkaḍeśhai lanilayum̐ ḍidam̐ḍu
kīlaga minniḍigi sugrīvanarasiṁhum̐ḍu