బహుపరాకులు నీకు పనులెన్నైనాఁ గలవు
(॥పల్లవి॥)
బహుపరాకులు నీకు పనులెన్నైనాఁ గలవు
తహతహలెల్లా మాని తలఁచుకో పొందులు
(॥బహు॥)
కప్పుర మాపె యుంపఁగాఁ గానుకిచ్చి పొడగంటి
నిప్పుడు నావిన్నపాన కేమంటివి
ముప్పిరిగొని వున్నారు ముందర నావంటివారు
తప్పక నామోము చూచి తలఁచుకో పొందులు
(॥బహు॥)
చెంది యాపెలేకలు నీచేతికి నే నియ్యఁగా నీ
వందుకొన్నందుకు వడియాల మేది
యెందరైనా వచ్చి చెలు లింతకతొల్లె వున్నారు
దండిగా నారా కెరింగి తలఁచుకోపొందులు
(॥బహు॥)
నెచ్చెలి పిలువుమనె నిన్ను శ్రీవేంకటేశ నే
వచ్చినపనికి నీవు వచ్చేదెపుడు
రచ్చ నిందరు నున్నారు రతి కింతలో వచ్చి
తచ్చి యాకెఁ గూడితివి తలఁచుకో పొందులు
(||pallavi||)
bahubarāgulu nīgu panulĕnnainām̐ galavu
tahadahalĕllā māni talam̐sugo pŏṁdulu
(||bahu||)
kappura mābĕ yuṁpam̐gām̐ gānugichchi pŏḍagaṁṭi
nippuḍu nāvinnabāna kemaṁṭivi
muppirigŏni vunnāru muṁdara nāvaṁṭivāru
tappaga nāmomu sūsi talam̐sugo pŏṁdulu
(||bahu||)
sĕṁdi yābĕlegalu nīsedigi ne niyyam̐gā nī
vaṁdugŏnnaṁdugu vaḍiyāla medi
yĕṁdarainā vachchi sĕlu liṁtagadŏllĕ vunnāru
daṁḍigā nārā kĕriṁgi talam̐sugobŏṁdulu
(||bahu||)
nĕchchĕli piluvumanĕ ninnu śhrīveṁkaḍeśha ne
vachchinabanigi nīvu vachchedĕbuḍu
rachcha niṁdaru nunnāru radi kiṁtalo vachchi
tachchi yāgĕm̐ gūḍidivi talam̐sugo pŏṁdulu