బతుకు మనవే యింకాఁ బై పైఁ దాను
(॥పల్లవి॥)
బతుకు మనవే యింకాఁ బై పైఁ దాను
రతికేల పిలిచేవే రానీవే తాను
(॥॥)
ముచ్చటలే యాడి యాడి మొదల నను భ్రమించి
చెచ్చెరఁ బంతాన కింత సేసేఁ గా తానూ
వచ్చి వచ్చి చేయి వేసి వాఁడు మోముకళ రేఁచి
పెచ్చు రేఁగి యింత ఱట్టు పెట్టెఁగా తానూ
(॥॥)
నంటు సేసి నవ్వి నవ్వి నాఁటకాలే పచరించి
యింటనే జాగరము సేయించెఁగా తాను
వెంట వెంటఁ దిరిగాడి వేమారుఁ గరఁగించి
దంట తనమున నాకు దక్కెఁగా తానూ
(॥॥)
సొలపులఁ జూచి చూచి సొమ్ములెల్లా నాకు నిచ్చి
కొలఁది మీరఁగ నన్నుఁగూడెఁ గా తాను
యెలమి శ్రీ వేంకటేశుఁ డింత నన్ను మన్నించి
బలిమి నుర మెక్కించి పై కొనెగా తానూ
(||pallavi||)
badugu manave yiṁkām̐ bai paim̐ dānu
radigela piliseve rānīve tānu
(||||)
muchchaḍale yāḍi yāḍi mŏdala nanu bhramiṁchi
sĕchchĕram̐ baṁtāna kiṁta sesem̐ gā tānū
vachchi vachchi seyi vesi vām̐ḍu momugaḽa rem̐si
pĕchchu rem̐gi yiṁta ṟaṭṭu pĕṭṭĕm̐gā tānū
(||||)
naṁṭu sesi navvi navvi nām̐ṭagāle pasariṁchi
yiṁṭane jāgaramu seyiṁchĕm̐gā tānu
vĕṁṭa vĕṁṭam̐ dirigāḍi vemārum̐ garam̐giṁchi
daṁṭa tanamuna nāgu dakkĕm̐gā tānū
(||||)
sŏlabulam̐ jūsi sūsi sŏmmulĕllā nāgu nichchi
kŏlam̐di mīram̐ga nannum̐gūḍĕm̐ gā tānu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍiṁta nannu manniṁchi
balimi nura mĕkkiṁchi pai kŏnĕgā tānū