బడిబడిఁ దిరిగాడీ బాలకృష్ణుఁడు
(॥పల్లవి॥)
బడిబడిఁ దిరిగాడీ బాలకృష్ణుఁడు
యెడయని జాణ గదె యీ బాలకృష్ణుఁడూ
(॥బడిబడి॥)
సొక్కుచు సోలుచు వచ్చి సుదతులు యెత్తుకొంటె
పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుఁడు
యిక్కువకుఁ జేయి చాఁచీ నేడ నైనాఁ దొంగి చూచీ
యెక్కుడు గామిడి గదె యీ బాలకృష్ణుఁడు
(॥బడిబడి॥)
చన్ను లంటి సారె సారె చవిగా ముద్దులు వెట్టి
పన్నీఁ గదె మెహ మెల్ల బాలకృష్ణుఁడు
సన్నలనె మొక్కు మొక్కీ సమ్మతిఁ బయ్యద దీసీ
యేన్నేసి నేరిచినాఁడె యీ బాలకృష్ణుఁడు
(॥బడిబడి॥)
నిండుఁగాగిట నించి నేరుపులు పచరించి
బండుమాట లాడీఁ గదె బాలకృష్ణుఁడు
అండనె శ్రీవెంకటాద్రి నాయ మెరిఁగి తాఁ గూడె
యెండ నీడ కన్నులతో నీ బాలకృష్ణుఁడూ
(||pallavi||)
baḍibaḍim̐ dirigāḍī bālakṛṣhṇum̐ḍu
yĕḍayani jāṇa gadĕ yī bālakṛṣhṇum̐ḍū
(||baḍibaḍi||)
sŏkkusu solusu vachchi sudadulu yĕttugŏṁṭĕ
pakkana navvulu navvī bālakṛṣhṇum̐ḍu
yikkuvagum̐ jeyi sām̐sī neḍa nainām̐ dŏṁgi sūsī
yĕkkuḍu gāmiḍi gadĕ yī bālakṛṣhṇum̐ḍu
(||baḍibaḍi||)
sannu laṁṭi sārĕ sārĕ savigā muddulu vĕṭṭi
pannīm̐ gadĕ mĕha mĕlla bālakṛṣhṇum̐ḍu
sannalanĕ mŏkku mŏkkī sammadim̐ bayyada dīsī
yennesi nerisinām̐ḍĕ yī bālakṛṣhṇum̐ḍu
(||baḍibaḍi||)
niṁḍum̐gāgiḍa niṁchi nerubulu pasariṁchi
baṁḍumāḍa lāḍīm̐ gadĕ bālakṛṣhṇum̐ḍu
aṁḍanĕ śhrīvĕṁkaḍādri nāya mĕrim̐gi tām̐ gūḍĕ
yĕṁḍa nīḍa kannulado nī bālakṛṣhṇum̐ḍū