Badalivumdaana nenu paibai nadiyaasala

బడలివుందాన నేను పైపై నడియాసల
Language

(॥పల్లవి॥)
బడలివుందాన నేను పైపై నడియాసల
జడిగొన్న కరుణతోఁ జనవియ్యరాదా

(॥॥)
యెగసక్కే లేలసేసే వేల బయలీఁ దించేవు
మగువ నింతే నన్ను మన్నించరాదా
నగవు లేమినవ్వేవు నాలిసేయ నేమిటికి
తగనీవిచ్చినబాస దలఁ చుకోరాదా

(॥॥)
చిత్తమేమి సోదించేవు చీఁకటేల తవ్వించేవు
బత్తిగలదాన నింతే పాలించరాదా
కొత్తలేల సేసేవు గుట్టువెట్టే వేమిటికి
యిత్తల నీదొరతన మెంచుకోరాదా

(॥॥)
చెక్కులేల నొక్కేవు సిగ్గులేలాయకట్టేవు
లక్కవంటిదాన నింతే లాలించరాదా
ఇక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
చొక్కించినరతు లెంచిచూచుకొనరాదా

(||pallavi||)
baḍalivuṁdāna nenu paibai naḍiyāsala
jaḍigŏnna karuṇadom̐ janaviyyarādā

(||||)
yĕgasakke lelasese vela bayalīm̐ diṁchevu
maguva niṁte nannu manniṁcharādā
nagavu leminavvevu nāliseya nemiḍigi
taganīvichchinabāsa dalam̐ sugorādā

(||||)
sittamemi sodiṁchevu sīm̐kaḍela tavviṁchevu
battigaladāna niṁte pāliṁcharādā
kŏttalela sesevu guṭṭuvĕṭṭe vemiḍigi
yittala nīdŏradana mĕṁchugorādā

(||||)
sĕkkulela nŏkkevu siggulelāyagaṭṭevu
lakkavaṁṭidāna niṁte lāliṁcharādā
ikkuvado śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
sŏkkiṁchinaradu lĕṁchisūsugŏnarādā