Badalenu paanubu parasare

బడలెను పానుపు పరచరే
Language

(॥పల్లవి॥)
బడలెను పానుపు పరచరే
అడుగరే యిదియేమియని చెలులు

(॥॥)
చెలపచెమటలు మైఁ జిప్పిలీని
అలసి వచ్చినాఁడు నేఁడదే విభుఁడు
చలువగాఁ గప్రము పైఁ జల్లఁగదరే
వెలయు సురటిఁగొని విసరరే

(॥॥)
పొనుగు నిట్టూరుపుల బుసకొట్టీని
పనిసేసి వచ్చినాఁ డప్పటి విభుఁడు
తనివారఁ చల్లనిగందము మెత్తరే
నినువుగఁ బన్నీరు నించరే

(॥॥)
దాఁగక దప్పి మోవులు దడిపీని
కాఁగి వచ్చినాఁడు శ్రీవేంకటవిభుఁడు
పాఁగి వాసించినబాగా లియ్యరే
చేఁగదేర నన్ను నేలె సేవలేల్లాఁ జేయరే

(||pallavi||)
baḍalĕnu pānubu parasare
aḍugare yidiyemiyani sĕlulu

(||||)
sĕlabasĕmaḍalu maim̐ jippilīni
alasi vachchinām̐ḍu nem̐ḍade vibhum̐ḍu
saluvagām̐ gapramu paim̐ jallam̐gadare
vĕlayu suraḍim̐gŏni visarare

(||||)
pŏnugu niṭṭūrubula busagŏṭṭīni
panisesi vachchinām̐ ḍappaḍi vibhum̐ḍu
tanivāram̐ sallanigaṁdamu mĕttare
ninuvugam̐ bannīru niṁchare

(||||)
dām̐gaga dappi movulu daḍibīni
kām̐gi vachchinām̐ḍu śhrīveṁkaḍavibhum̐ḍu
pām̐gi vāsiṁchinabāgā liyyare
sem̐gadera nannu nelĕ sevalellām̐ jeyare