బాయిటఁ బడె వలపు పడఁతికి నీకును
(॥పల్లవి॥)
బాయిటఁ బడె వలపు పడఁతికి నీకును
యీ యెడ నా మోము చూచి యెంత నవ్వేవు
(॥॥)
అక్కర యంతో కాని అప్పటప్పిటికి నిన్నుఁ
జెక్కు నొక్కి చెలి నీపై సేస వెట్టీని
పక్కన నాకెసేసేబత్తి చేకొనఁగరాదా
యిక్కున నామోము చూచి యెంతనవ్వేవు
(॥॥)
యేకతా లెట్టివో కాని యెదుటనే కాచుకుండి
మేకొని సన్నలు సేసి మేలమాడీని
నీకేమి యాపెసలిగె నెమ్మదిఁ జెల్లించరాదా
యీకడ నామోము చూచి యెంతనవ్వేవు
(॥॥)
వేడుక యెట్టిదో కాని వెలఁ ది కాఁగిటఁ గూడి
జోడై శ్రీ వేంకటేశ చొక్కించీని
యీడుగా నన్నేలితివి యిట్టె యాపెఁ గూడరాదా
యీడేర నామోము చూచి యెంతనవ్వేవు
(||pallavi||)
bāyiḍam̐ baḍĕ valabu paḍam̐tigi nīgunu
yī yĕḍa nā momu sūsi yĕṁta navvevu
(||||)
akkara yaṁto kāni appaḍappiḍigi ninnum̐
jĕkku nŏkki sĕli nībai sesa vĕṭṭīni
pakkana nāgĕsesebatti segŏnam̐garādā
yikkuna nāmomu sūsi yĕṁtanavvevu
(||||)
yegadā lĕṭṭivo kāni yĕduḍane kāsuguṁḍi
megŏni sannalu sesi melamāḍīni
nīgemi yābĕsaligĕ nĕmmadim̐ jĕlliṁcharādā
yīgaḍa nāmomu sūsi yĕṁtanavvevu
(||||)
veḍuga yĕṭṭido kāni vĕlam̐ di kām̐giḍam̐ gūḍi
joḍai śhrī veṁkaḍeśha sŏkkiṁchīni
yīḍugā nannelidivi yiṭṭĕ yābĕm̐ gūḍarādā
yīḍera nāmomu sūsi yĕṁtanavvevu